తమన్నా చివరి గంటలో ఏం మోగించబోతుందో !

మిల్క్ బ్యూటీ అని అభిమానులు ప్రేమగా పిలుచుకుంటుంటారు త‌మ‌న్నాని. ఏమైన తమన్నా మాత్రం ఆ మిల్క్ బ్యూటీ బిరుదును కాపాడుకోవడానికి బాగానే కష్టపడుతోంది. ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసినా ఇంకా సినిమాలు షోలు అంటూ చేతి నిండా పనితో పర్సనల్ లైఫ్ ను కూడా త్యాగం చేస్తూ ఆ రకంగా ముందుకుపోతోంది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే తమన్నా కూతురు కూడా ఈ పాటికి టీనేజ్ లోకి వచ్చి ఉండేది […]

Written By: Neelambaram, Updated On : November 10, 2020 7:01 pm
Follow us on

మిల్క్ బ్యూటీ అని అభిమానులు ప్రేమగా పిలుచుకుంటుంటారు త‌మ‌న్నాని. ఏమైన తమన్నా మాత్రం ఆ మిల్క్ బ్యూటీ బిరుదును కాపాడుకోవడానికి బాగానే కష్టపడుతోంది. ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసినా ఇంకా సినిమాలు షోలు అంటూ చేతి నిండా పనితో పర్సనల్ లైఫ్ ను కూడా త్యాగం చేస్తూ ఆ రకంగా ముందుకుపోతోంది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే తమన్నా కూతురు కూడా ఈ పాటికి టీనేజ్ లోకి వచ్చి ఉండేది అని సోషల్ మీడియాలో తమన్నా మీద నెటిజన్లు జోక్స్ కూడా పేలుస్తున్నారు. ఏది ఏమైనా దర్శక నిర్మాతలను ఆకట్టుకోవడంలో, హీరోలతో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేయడంలో తమన్నా మాస్టర్స్ చేసిందనుకోవాలి.

Also Read: చరణ్ మిస్ అయినా.. ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నాడు !

పైగా మంచి మాటకారి కూడా, మాములు జనానికి కూడా తనలోని మాటకారిని… త‌న ముద్దు ముద్దు మాట‌లతో, అలాగే షో స్టార్టింగ్ లో వచ్చే సాంగ్స్ లో తన అంద‌చందాల‌తో తెలుగు ప్రేక్షకులను అల‌రించ‌డానికి ఈ మిల్క్ బ్యూటీ లెవంత్ అవర్ అనే షోతో రెడీ అయిపోయింది. అయితే ఇంతకీ ఈ లెవంత్ అవర్ అంటే ఏమిటి ? మిడ్ నైట్ షోల వ్యవహారంలాగా చివరి గంటలో తమన్నా ఏం మోగించబోతుందో.. అన్నట్లు పరుచూరి గోపాల్ కృష్ణ సినిమాల మీద లెవంత్ అవర్ అని ఒక బుక్ ఒకటి రాశారు. ఆ పుస్తకంలో అప్పటి సినిమాల వ్యవహారాలు, విషయాలు ఉంటాయి. మరి తమన్నా చేయబోతున్న లేవంత్ అవర్ కి, పరుచూరి లేవంత్ అవర్ కి ఏమైనా కనెక్షన్ ఉందేమో చూడాలి.

Also Read: “యువర్ లైఫ్” గెస్ట్ ఎడిటర్ గా హీరోయిన్ రష్మిక మందాన్న

ఇక ప్రస్తుతం ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ తన అహా కోసం మిల్కీ బ్యూటీకి భారీ మొత్తం ఇచ్చి.. ప్ర‌త్యేకంగా ఈ లెవంత్ అవర్ టాక్ షోను ప్లాన్ చేశాడు. కాగా దీపావళి నుండి ఈ టాక్ షో మొదలుకానుంది. మరి తమన్నా హోస్ట్‌గా ఈ షోని ఏ రేంజ్ లో హిట్ చేస్తోందో.. తమన్నా త‌న ప్ర‌శ్న‌ల‌తో షోను ఎంతవరకు ర‌క్తి క‌ట్టిస్తుందో చూడాలి. ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయట. అన్నట్టు చాలా కాలంగా త‌నలో బ‌లంగా నాటుకున్న కోరిక ఈ హోస్టింగ్ చేయడం అని త‌మ‌న్నా చెప్పుకొచ్చింది. మరి ఆవిడగారి హోస్టింగ్ పనితీరు ఎలా ఉంటుందో చూద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్