మెగస్టార్ కి కరోనా రావడం, చరణ్ కూడా షూట్ నుండి వెళ్లిపోవాల్సి రావడం మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. చరణ్ డేట్స్ మిస్ అవ్వడంతో ఇప్పుడు మిగిలిన ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం కాంబినేషన్ షాట్స్ ను ప్లాన్ చేసుకున్నాడు. దాంతో సినిమాలోని మెయిన్ ఆర్టిస్ట్ లందరి డేట్స్ తీసుకుని షూట్ చేస్తుండగా చిరుకి కరోనా వచ్చింది. చరణ్ మరో పది రోజుల పాటు షూట్ లో పాల్గొనే అవకాశం లేదట. అయితే ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కి సంబందించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది.
Also Read: మహేశ్ బాబు నుండి పరుశురామ్ కి క్లారిటీ !
రేపటి నుండి జరగబోయే షూట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడానికి రాజమౌళి ప్లాన్ చేయిస్తున్నాడట. మొదట ఈ సీన్స్ ను గోల్కండ కోటలో షూట్ చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేయాలనుకున్నప్పటికీ.. సడెన్ గా షూట్ కి గ్యాప్ రావడంతో.. గతంలో వేసిన సెట్స్ లోనే షూట్ చేస్తున్నారు. తారక్ పై ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కావడంతో.. సీన్స్ లో పిరంగలిలో పేల్చే షాట్స్ కూడా అంతే స్థాయిలో తీయాలని రాజమౌళి ఆ షాట్స్ ను మాత్రం గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి.. సిజీ వర్క్ చేయించాలని డిసైడ్ అయ్యాడట. అందుకు తగ్గ సీజీ బృందంతో కూడా రాజమౌళి చర్చలు జరిపి.. ఇప్పటికే తనకు ఎలాంటి షాట్స్ కావాలో వారికి క్లారిటీ కూడా ఇచ్చాడట.
Also Read: “యువర్ లైఫ్” గెస్ట్ ఎడిటర్ గా హీరోయిన్ రష్మిక మందాన్న
ఏది ఏమైనా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై రాజమౌళి మొదటినుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తారక్ సీన్స్ ను అలాగే తారక్ గెటప్ ను బాగా ఎలివేట్ చేస్తున్నాడు. అన్నిటికీ మించి ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతుండటం, పైగా ఆ పాత్రలోనే స్వతహాగా మంచి ఆవేశం ఉంటుంది. దానికితోడు ఆ ఆవేశానికి ఎన్టీఆర్ నటనకి కరెక్ట్ మ్యాచ్ అవుతోంది. అందుకే ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడాచాలకొత్తగా ఉంటాయని.. ఓవరాల్ గా మొత్తం సినిమాలోనే ఎన్టీఆర్ హైలైట్ అవ్వబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. రాజమౌళికి పర్సనల్ గా తారక్ పై అభిమానం ఉంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్