మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా షూటింగ్ ని మొత్తానికి పూర్తి చేసి.. ప్రస్తుతం డబ్బింగ్ కూడా చెబుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రవితేజ అయోమయంలో పడిపోయాడట. అసలు క్రాక్ తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో గత కొన్ని రోజులుగా రవితేజ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ కాచుకుని కూర్చున్నారు. రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుందని.. ఎలాగూ తనకు కావాల్సినది కూడా అదే కాబట్టి.. రవితేజ దాదాపు రమేష్ వర్మకే ఫిక్స్ అయ్యాడు.
Also Read: చరణ్ మిస్ అయినా.. ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నాడు !
డిసెంబర్ నుండి డేట్స్ కూడా ఇచ్చాడు. అయితే అసలు రమేష్ వర్మ దగ్గర స్క్రిప్ట్ కూడా లేదట. ఆయన రైటర్స్ తో కూర్చుని స్క్రిప్ట్ ను వండే పనిలో ఉన్నాడు. అది ఇప్పట్లో తేలేలా లేదు. అందుకే రవితేజ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తన తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. కానీ ఈ సినిమా కూడా కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. స్క్రిప్ట్ రెడీగా ఉన్నా.. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అని.. సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని.. అలాగే మరో యంగ్ హీరో కూడా ఓ పాత్రలో నటించాల్సిన అవసరం ఉందని.. ఓవరాల్ గా అందరూ సెట్ ఈ సినిమా మొదలు అవ్వడానికి కూడా మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది.
Also Read: తమన్నా చివరి గంటలో ఏం మోగించబోతుందో !
అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇక యంగ్ హీరో పాత్రకు ప్రిన్స్ ను అనుకుంటున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఈ సినిమాలో క్యాస్టింగ్ ఫైనల్ అయింది. కాకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లోని కంటెంట్ ప్రకారం ఒక సీనియర్ హీరోయిన్ కావలి. ఈ సాంగ్ కోసం శ్రీయాను అనుకున్నారు. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకురాకపోతే గనుక.. ఇక రవితేజ కూడా జగపతి బాబు, శ్రీకాంత్ లా సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే. మరి చూడాలి రవితేజ ఏమవుతాడో.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్