https://oktelugu.com/

పాపం బాలయ్య.. చివరకు ‘తమన్నా’నే దిక్కు !

హీరోయిన్ తమన్నా ప్రస్తుతం అయోమయంలో కొట్టుమిట్టాడుతుందట. సినిమాలు చేయాలా.. లేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలా అని తెచ్చుకోలేకపోతుందట. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నాకు ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. కానీ ఆ హీరో పక్కన చేయాలా వద్దా అని ఆమె ఆలోచనలో పడింది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎందుకు ఆమె ఇంతలా ఇబ్బంది పడుతుందంటే.. తమన్నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది నటసింహం బాలయ్య బాబు పక్కన. బోయపాటి […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 02:20 PM IST
    Follow us on


    హీరోయిన్ తమన్నా ప్రస్తుతం అయోమయంలో కొట్టుమిట్టాడుతుందట. సినిమాలు చేయాలా.. లేక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలా అని తెచ్చుకోలేకపోతుందట. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నాకు ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. కానీ ఆ హీరో పక్కన చేయాలా వద్దా అని ఆమె ఆలోచనలో పడింది. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎందుకు ఆమె ఇంతలా ఇబ్బంది పడుతుందంటే.. తమన్నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది నటసింహం బాలయ్య బాబు పక్కన. బోయపాటి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చివరకు తమన్నా దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

    Also Read: నిహారిక పెళ్ళిలో రచ్చ చేసిన మెగా అండ్ అల్లు దంపతులు !

    అయితే బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గా చేసిన హీరోయిన్ల కెరీర్స్ ఏమైపోయాయో అనే విషయం తమన్నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే ఏమి చెప్పాలో ఆమెకు తెలియడం లేదట, నిజానికి తమన్నా ప్రస్తుతం ఉన్న పొజిషన్ కి, ఈ సినిమా మంచి ఆఫరే అనుకోవాలి. ఎఫ్ 2 తరువాత తమన్నాకు మళ్ళీ ఆ రేంజ్ ఆఫర్ ఇంతవరకూ రాలేదు. ఎంత లేదు అన్నా.. టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ అయ్యే. కాకపోతే కెరీర్ మాత్రం ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేకపోగా చివరి దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఈ సినిమా ఒప్పుకోక తప్పనిసరి కాబట్టి, తమన్నా కూడా బాలయ్యతో రొమాన్స్ కి రెడీ అవ్వక తప్పదు.

    Also Read: ‘స‌ర్కారు వారి పాట’‌.. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు !

    ఎలాగూ గత కొన్ని సంవత్సరాలుగా బాలయ్య బాబుకు హీరోయిన్ సమస్య అనేది చాలా సహజమైన విషయం అయిపోయింది కాబట్టి.. కొత్తవారి నుండి ఫేడ్ అవుట్ హీరోయిన్స్ వరకూ ఇప్పటికే బాలయ్య అందర్నీ చూసేశారు కాబట్టి.. ఇక తమన్నా లాంటి వారే దిక్కు. నిజానికి ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని బోయపాటి చాలా ప్లాన్ చేసుకున్నా.. ఆ కొత్త హీరోయిన్ కి తమిళ్ హీరో విశాల్ సినిమాలో ఛాన్స్ వచ్చే సరికి అటు వెళ్లిపోయింది. దాంతో బాలయ్యకు హీరోయిన్ సమస్య మళ్లీ మొదటికి వచ్చేసింది. ఇక లాభం లేదు అనుకుని బోయపాటి తమన్నాకు ఫిక్స్ అయ్యాడట. పాపం బాలయ్య.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్