ఏపీ మహిళా అధికారిణుల మధ్య కొత్త వివాదం..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలపై రగడ సాగుతోంది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య ఎన్నికల నిర్వహణపై కోల్డ్ వార్ సాగుతోంది. ఈ వ్యవహారం కోర్టుదాకా కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ తతంగంలో జగన్ , ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ల మధ్య సాగుతున్న వైరంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా పడుతున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన కొత్త విషయం ఉంది. ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని, ఎన్నికల […]

Written By: NARESH, Updated On : December 9, 2020 8:47 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా స్థానిక సంస్థల ఎన్నికలపై రగడ సాగుతోంది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య ఎన్నికల నిర్వహణపై కోల్డ్ వార్ సాగుతోంది. ఈ వ్యవహారం కోర్టుదాకా కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ తతంగంలో జగన్ , ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ల మధ్య సాగుతున్న వైరంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా పడుతున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన కొత్త విషయం ఉంది. ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని, ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ఉన్న వాణి మోహన్ ల మధ్య కొత్త వివాదం తలెత్తింది. ఇంతకీ ఏంటా వివాదం..?

Also Read: తిరుపతిలో పవన్ మద్దతుకే పరిమితమా?

ప్రస్తుతం ఎన్నికల కమిషన్ గా ఉన్న వాణీ మోహన్ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ జీవో జారీ చేశారు.అందులో ‘ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి సీఆర్పీసీ నిబంధనలపై కచ్చితంగా ఒక రిఫ్రెషర్ కోర్సు చేయాలి.తద్వారా తన నైపుణ్యాన్ని పెంచుకోవాలి’ అని జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవో జారీ చేయడానికి గల కారణమోటి ఉంది.

గతంలో వాణి మోహన్ సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని భూముల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారింది. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆమె తప్పు చేశారు గానీ.. అవినీతికి పాల్పడలేదని నివేదిక ఇచ్చారు. ఈ విషయంలో ఆరోపణలు తిరస్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో వాణి మోహన్ పై నీలం ఘాటు వ్యాఖ్యలతో జీవో జారీ చేశారని అంటున్నారు. అయితే కేవలం మెమోతో సరిపెట్టే విషయాన్ని ఇంతగా జీవో జారీ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Also Read: అమావాస్య చంద్రులు..!

ఇదిలా ఉండగా వాణి మోహన్ పై ఇంతగా కోపం ఎందకని అనుకుంటే ఆమె నిర్వహిస్తున్న విధులే కారణమట. కొంతకాలంగా ఎలక్షన్ కమిషనర్ కలెక్టర్ల వీడియ్ కాన్ఫరెన్స్ కు అనుమతి ఇవ్వాలని నిమ్మగడ్డ రమేశ్ కోరగా నీలం సాహ్ని తిరస్కరించారు. దీంతో రమేశ్ కోర్టుకు వెళ్లారు. అయితే ఎలక్షన్ కమిషన్ మొత్తంపై గుర్రుగా ఉన్న నీలం సాహ్ని ఆ విభాగంలో పనిచేసే వాణి మోహన్పై కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఎస్ నీలం సాహ్ని తీసుకొస్తున్న కొన్ని జీవోలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆమె రాస్తున్న లేఖలు కోర్టు ఉల్లంఘలన్నచర్చ కూడా సాగుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్