తిరుపతిలో పవన్ మద్దతుకే పరిమితమా?

“తిరుప‌తి లోక్ సభ ఉప ఎన్నికలో ఎలాగైనా పోటీ చేయాలి. గెలిచి పార్లమెంట్ గడప తొక్కాలి” ఇదీ.. జనసేన అధ్యక్షుడు పవన్ లక్ష్యం. కానీ.. ఇది జరుగుతుందా? అంటే.. చాన్స్ తక్కువే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా.. తిరుపతి ఉప ఎన్నిక విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుకు ఒక స్ట్రాట‌జీ ఉందంటున్నారు. జ‌న‌సేన అక్క‌డ పోటీ చేయ‌డ‌మే చంద్ర‌బాబు వ్యూహం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ పంచ‌న చేర్చిన చంద్ర‌బాబు నాయుడే.. ఇప్పుడు తిరుప‌తిలో బీజేపీ మ‌ద్ద‌తుతో జ‌న‌సేన […]

Written By: Neelambaram, Updated On : December 9, 2020 2:08 pm
Follow us on


“తిరుప‌తి లోక్ సభ ఉప ఎన్నికలో ఎలాగైనా పోటీ చేయాలి. గెలిచి పార్లమెంట్ గడప తొక్కాలి” ఇదీ.. జనసేన అధ్యక్షుడు పవన్ లక్ష్యం. కానీ.. ఇది జరుగుతుందా? అంటే.. చాన్స్ తక్కువే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా.. తిరుపతి ఉప ఎన్నిక విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుకు ఒక స్ట్రాట‌జీ ఉందంటున్నారు. జ‌న‌సేన అక్క‌డ పోటీ చేయ‌డ‌మే చంద్ర‌బాబు వ్యూహం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ పంచ‌న చేర్చిన చంద్ర‌బాబు నాయుడే.. ఇప్పుడు తిరుప‌తిలో బీజేపీ మ‌ద్ద‌తుతో జ‌న‌సేన నిల‌బ‌డాలనే లెక్క‌లు వేశార‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. తద్వారా వైసీపీని ఓడించాలనేది ఆయన టార్గెట్. కానీ.. ప‌వ‌న్ కు బీజేపీ సరైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదనే ప్రచారం సాగుతోంది.

Also Read: వలంటీర్ల ఉద్యోగాల తొలగింపులో మర్మమేమిటి..?

వాస్తవానికి తిరుప‌తి ఎంపీ టికెట్ విష‌యంలో ఇప్ప‌టికే బీజేపీ అధిష్టానంతో జ‌న‌సేన అధినేత సంప్రదించారు. కానీ.. కాషాయ పార్టీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. దీంతో ఈ అంశంపై అటో ఇటో తేల్చుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నారు. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరిక‌ను బీజేపీ తీర్చే అవ‌కాశాలు కనిపించట్లేదు. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటి, ఊపుమీద ఉన్న కమల దళం.. తిరుప‌తిలోనూ బ‌రిలోకి దిగి ఏపీలో ప్ర‌తిప‌క్షం తామే అని నిరూపించుకోవాల‌నే ఉబ‌లాటంటో ఉంది. కాబ‌ట్టి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరిక‌ను ఆ పార్టీ మన్నించే అవ‌కాశాలు తక్కువే అని చెప్పొచ్చు.

అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ప్ర‌య‌త్నాల‌ను ఆప‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తన పార్టీ ఘోరంగా విఫలమైంది. త‌ను రెండు చోట్ల పోటీ చేసినప్ప‌టికీ గెలవలేకపోయారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఎలాగైనా విజయం సాధించాలని పవన్ భావిస్తున్నారని టాక్. అందుకే.. బీజేపీతో చ‌ర్చ‌లు కొనసాగిస్తున్నారని అంటున్నారు.

Also Read: ఉండవల్లి వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ నేతలు..!!

అయితే.. బీజేపీకి ఇప్పుడు పవన్ తో అంత అవసరం లేదు. అంతే కాకుండా.. తిరుపతిలో గెలిస్తే, ఏపీలో బలపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, త‌మ అభ్య‌ర్థే బ‌రిలో ఉండాల‌ని బీజేపీ పవన్ కు స్ప‌ష్టం చేస్తే.. అప్పుడు జ‌న‌సేన ఏం చేయ‌గ‌ల‌దు? బీజేపీని కాద‌ని పోటీకి దిగే ఆలోచన పవన్ చేస్తారా? అంటే అనుమానమే. కాబట్టి, తెలంగాణలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మద్దతు ప్రకటించినట్టుగానే.. తిరుపతిలో కూడా బీజేపీకి మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించ‌డం త‌ప్ప, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌రో ఛాయిస్ లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, అంతిమంగా బీజేపీ ఏం చెబుతుంది? పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్