https://oktelugu.com/

మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ

‘ఏం సక్కగున్నావ్ రో నా సొట్ట బుగ్గలోడా’ అంటూ పదేళ్ల కిందట మంచు మనోజ్‌ సరసన ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో ఆడిపాడి వెండితెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. ఢిల్లీలో పుట్టిన ఈ చిన్నది టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, చాలా సినిమాలు ఫెయిలవడంతో క్రమంగా చాన్స్‌లు తగ్గాయి. కెరీర్ ఆరంభంలోనే తమిళ్‌, మలయాళ సినిమాలు చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. లాభం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 04:48 PM IST
    Follow us on


    ‘ఏం సక్కగున్నావ్ రో నా సొట్ట బుగ్గలోడా’ అంటూ పదేళ్ల కిందట మంచు మనోజ్‌ సరసన ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో ఆడిపాడి వెండితెరకు పరిచయమైంది తాప్సీ పన్ను. ఢిల్లీలో పుట్టిన ఈ చిన్నది టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, చాలా సినిమాలు ఫెయిలవడంతో క్రమంగా చాన్స్‌లు తగ్గాయి. కెరీర్ ఆరంభంలోనే తమిళ్‌, మలయాళ సినిమాలు చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. లాభం లేదని ముంబై బాట పట్టింది. తొలుత బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె క్రమంగా పుంజుకుంది. అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బేబీ’తో మంచి హిట్‌ అందుకున్న తాప్సీ కెరీర్ నాలుగేళ్ల కింద వచ్చిన ‘పింక్‌’తో పూర్తిగా టర్న్ అయింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్అవగా… తాప్సీ నటనకు మంచి పేరు వచ్చింది. అంతే అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. అదే స్థాయిలో హిట్లు కూడా పడడంతో హిందీలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, కెరీర్ తొలినాళ్లలో మాదిరిగా ఏది పడితే అది చేయకుండా వైవిధ్య కథలనే ఎంచుకోవడం తాప్సీకి చాలా ప్లస్‌ అయింది. బలమైన కథ, నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ హిట్లు సాధించిందామె.

    Also Read: ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్

    ప్రస్తుతం హిందీలో ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. ‘హసీన్ దిల్‌రుబా’, ‘శభాష్ మిథూ’, ‘లూప్ లపేటా’, ‘రష్మీరాకెట్’ చిత్రాలు చేస్తోందామె. అయితే, హిందీలో జోరు కొనసాగిస్తూనే కెరీర్ ఆరంభంలో తనకు అవకాశాలు ఇచ్చిన దక్షిణాది భాషలపై మళ్లీ దృష్టి పెట్టిందామె. అక్కడ కూడా తన ప్రతిభ నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్న తాప్సీ తమిళంలో జయం రవితో కలిసి ‘జనగణమన’ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఆమె మరో తమిళ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ సుందర రాజన్‌ కొడుకు దీపక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాకు ఆమె కమిట్మెంట్‌ ఇచ్చిందని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. కానీ, అది హీరో క్యారెక్టరా? ప్రత్యేక పాత్ర? అన్నది తేలాల్సి ఉంది. ఈ చిత్రంలో తాప్సీ పక్కా మాస్‌ లుక్‌లో, వీధుల్లో పని చేసే మహిళ పాత్రను పోషిస్తుందట. ఆమె పాత్ర కామెడీ కూడా పండిస్తుందని, ఈ చిత్రం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కథ, తన పాత్ర నచ్చితే దక్షిణాదిలో మరిన్ని చిత్రాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తాప్సీ స్పష్టం చేసింది. దాంతో, సౌత్‌లో ఆమె మరిన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.