మనమే ముందు స్టార్ట్ చేయాలి – బాలయ్య !

సీనియర్ హీరోలు షూట్ అంటే చాలు.. ఎందుకు రిస్క్ అంటూ పోస్ట్ ఫోన్ చేసుకుంటూ పోతున్నారు, ఒక్క బాలయ్య తప్ప. అవును బాలయ్య షూట్ కి రెడీ అంటున్నాడు. దర్శకనిర్మాతలు కొన్నాళ్లు ఆగుదాం అంటున్న.. నో.. షూట్ అందరి కంటే మనమే ముందు స్టార్ట్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేసేశాడు. మొత్తంమీద బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేసేదానిలో కూడా తోటి హీరోలతో పోటీ పడుతున్నాడు. మరి బాలయ్య అంతే.. ఒక్కసారి ముహూర్తం పెట్టుకుని ఫిక్స్ అయ్యాడు […]

Written By: admin, Updated On : August 28, 2020 4:32 pm
Follow us on


సీనియర్ హీరోలు షూట్ అంటే చాలు.. ఎందుకు రిస్క్ అంటూ పోస్ట్ ఫోన్ చేసుకుంటూ పోతున్నారు, ఒక్క బాలయ్య తప్ప. అవును బాలయ్య షూట్ కి రెడీ అంటున్నాడు. దర్శకనిర్మాతలు కొన్నాళ్లు ఆగుదాం అంటున్న.. నో.. షూట్ అందరి కంటే మనమే ముందు స్టార్ట్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేసేశాడు. మొత్తంమీద బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేసేదానిలో కూడా తోటి హీరోలతో పోటీ పడుతున్నాడు. మరి బాలయ్య అంతే.. ఒక్కసారి ముహూర్తం పెట్టుకుని ఫిక్స్ అయ్యాడు అంటే.. ఇక ఆ పని అయిపోవాల్సిందే. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయడం బాలయ్య కెరీర్ లోనే లేదు. ఏది ఏమైనా బాలయ్య వచ్చే సోమవారం నుండి షూట్ చేయడానికి టైం ఫిక్స్ చేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజీ సెట్ లో షూట్ స్టార్ట్ కానుంది.

Also Read: ఓటీటీలు సినీ ఇండస్ట్రీకి లాభమా? నష్టమా?

దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా ఇప్పుడు షూట్ చేయడం ఇష్టం లేదట.. ప్రస్తుతం కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉంది. సరే.. రిస్క్ చేసి షూట్ స్టార్ట్ చేసిన మిగిలిన నటీనటులు షూట్ కి వస్తారని నమ్మకం లేదు. మరోవైపు ఇప్పుడే షూట్ వద్దు అంటూ కొంతమంది ఆర్టిస్ట్ లు బోయపాటికి పర్సనల్ గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారట. కానీ, షూటింగ్ విషయం బోయపాటి చేతిలో కూడా ఏమిలేదు. బాలయ్య బాబు డిసైడ్ చేశాడు. దీనికి తోడు రెండు సంవత్సరాల నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్య బాబుకు మెయిన్ హీరోయిన్ దొరకలేదు. ఆయితే కేరళ నుండి ఒక కొత్త హీరోయిన్ ను పట్టుకొచ్చారు. ఆమె కూడా బాలయ్య బాబు పక్కన సరిగ్గా సెట్ అవ్వట్లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయమే మెయిన్ హైలైట్

మరి బోయపాటి తెలిసిన హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తాడో లేక.. ఆ కొత్త అమ్మాయినే తన శైలిలో ప్రెజెంట్ చేస్తాడా అనేది చూడాలి. ఒకటి మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. నటీనటులు వచ్చినా రాకపోయినా.. తనకి మాత్రమే సంబంధించిన సోలో సీన్స్ ను అయినా బాలయ్య బాబు షూట్ చేయడం పక్కా. వచ్చే సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలనేది బాలయ్య ప్లాన్. అయితే ఒకపక్క కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం అల్లాడిపోతూ ఉంది. బాలయ్య తోటి హీరోలు వెంకీ, చిరు లాంటి స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం మొత్తం తమ షూటింగ్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను వాయిదా కూడా వేసుకున్నారు.