https://oktelugu.com/

బన్నీ- కొరటాల.. భరత్‌ అనే నేను ఫార్ములా

నాలుగు చిత్రాలతోనే టాలీవుడ్‌లో టాప్ ‌డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల శివ. ఆ నాలుగూ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. పైగా వేటికవే సాటి. సామాజిక స్పృహ ఉన్న కొరటాల తన ప్రతి చిత్రంతో ఓ సోషల్‌ మెసేజ్‌ ఇస్తున్నాడు. అంతేకాదు బలమైన కథ, కమర్షియల్‌ హంగులూ సమపాళ్లలో మేళవించడంలో ఆరితేరారు అని చెప్పొచ్చు. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన కొరటాల దర్శకుడిగా తన మార్కు ఉండేలా చూసుకుంటున్నాడు. తొలి చిత్రం ‘మిర్చి’తోనే ఆల్‌రౌండర్ అనిపించుకున్న ఆయన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 05:00 PM IST
    Follow us on


    నాలుగు చిత్రాలతోనే టాలీవుడ్‌లో టాప్ ‌డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల శివ. ఆ నాలుగూ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. పైగా వేటికవే సాటి. సామాజిక స్పృహ ఉన్న కొరటాల తన ప్రతి చిత్రంతో ఓ సోషల్‌ మెసేజ్‌ ఇస్తున్నాడు. అంతేకాదు బలమైన కథ, కమర్షియల్‌ హంగులూ సమపాళ్లలో మేళవించడంలో ఆరితేరారు అని చెప్పొచ్చు. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన కొరటాల దర్శకుడిగా తన మార్కు ఉండేలా చూసుకుంటున్నాడు. తొలి చిత్రం ‘మిర్చి’తోనే ఆల్‌రౌండర్ అనిపించుకున్న ఆయన తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్‌ అనే నేను చిత్రాలతో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పని చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీలో చిరు నక్సలైట్‌గా కనిపిస్తారు. ఆయన ఇలాంటి పాత్ర తొలిసారి చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో మార్చి వరకూ షూటింగ్‌ జరిగింది. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోగా.. తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు కొరటాల.

    ఈ క్రమంలో తన ఆరో చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేస్తున్నట్టు ప్రకటించాడు. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న బన్నీ.. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూట్‌ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. ఎలాగో బ్రేక్‌ వచ్చింది కాబట్టి తన 21వ సినిమా.. అదే కొరటాలతో రాబోయే చిత్రంపై దృష్టి పెట్టాడు బన్నీ. హీరోయిన్‌, ఇతర నటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట బన్నీ, కొరటాల. ఎప్పట్లానే తన మార్కు సోషల్‌ మెసేజ్‌తో ఈ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు శివ. ఇలాంటి సినిమాలో నటించడం బన్నీకి ఇదే తొలిసారి కానుంది. బన్నీ కోసం ‘భరత్‌ అనే నేను’ మూవీ ఫార్ములాను కొరటాల ఫాలో అవుతున్నాడట. ఆ సినిమా లాంటి సాఫ్ట్‌ స్టోరీని అల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా రెడీ చేశాడని టాక్. అలాగే, భరత్‌ అనే నేనుతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్‌ నటి కియారా ఆడ్వానీనే బన్నీ సరసన కథానాయికగా తీసుకోవాలని కొరటాల ఫిక్సయ్యాడట. భరత్‌ అనే నేను లో మహేశ్‌కు జోడీగా కియారా మెప్పించింది. తన ఆరో చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవెల్లో తీయాలని ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్‌గా కియారా అయితేనే బాగుటుందని శివ భావిస్తున్నాడు. అయితే, హిందీలో ఫుల్‌ బిజీగా ఉన్న ఆమె ఈ చిత్రానికి డేట్స్ ఇస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తాడని సమాచారం.