Prabhas Marriage: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను సంపాదించి తన సత్తా చాటాడు ప్రభాస్. ఎన్నో హిట్ లు, సక్సెస్ ఫుల్ జర్నీ ఉన్న ఈ స్టార్ ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. కానీ రీసెంట్ గా ప్రభాస్ పెళ్లి అనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. స్వయంగా తన పెద్దమ్మనే ఈ మాట చెప్పడంతో అభిమానులు మరింత సంతోష పడుతున్నారు. ఇంతకీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఏం అన్నారు? అమ్మాయి ఎవరు? ముహుర్తం గురించి ఏమైనా చెప్పారా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేవీ నవరాత్రులు పురష్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు శ్యామలా దేవి. ఇదే సందర్భంగా ఆమె ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడింది. ఈ స్టార్ హీరో పెళ్లి అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు అనుష్క శెట్టి. బాహుబలి, మిర్చి సినిమాలో నటించి సూపర్ జోడీగా నిలిచారు. రీల్ లోనే కాదు రియల్ లో కూడా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గతం నుంచే చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా ఈ వార్తలు ఖండిస్తూనే ఉన్నారు.
అనుష్క కూడా ఈ వార్తలపై ఇప్పటికే ఎన్నో సార్లు స్పందించింది. అయినా కూడా అనుష్క పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్ కూడా. అంతేకాకుండా, వీరిద్దరూ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. దీంతో ఎప్పటికైనా ఈ జోడీ పెళ్లి చేసుకుంటుందేమోనని ఫ్యాన్స్‌కి ఎక్కడో చిన్న ఆశ.ఈ సందర్భంలో శ్యామలా దేవి కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి జరుగుతుందని.. వచ్చే దసరా లోపు పెళ్లి అని.. త్వరలో శుభకార్యం ఉంటుందని చెప్పారు. అయితే కృష్ణంరాజు బతికుండగానే.. ప్రభాస్ పెళ్లి చేసేద్దామనుకున్నారట. కానీ, షూటింగ్స్‌తో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదట.
ఇదిలా ఉంటే రాధే శ్యామ్ సినిమా కంటే ముందు కూడా ప్రభాస్ కు త్వరలో పెళ్లి అని చెప్పారు. కానీ ఇప్పటికీ పెళ్లి జరగలేదు. మరి అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడానా? లేదా ఈ సారైనా ప్రభాస్ కు పెళ్లి జరుగుతుందా? జరిగితే ఎవరితో? అనుష్కతోనా లేదా మరో అమ్మాయితోనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అనుష్క, ప్రభాస్ అభిమానులు.