spot_img
Homeఎంటర్టైన్మెంట్Swag Collection: శ్రీవిష్ణు 'స్వాగ్' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..90 శాతానికి పైగా...

Swag Collection: శ్రీవిష్ణు ‘స్వాగ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..90 శాతానికి పైగా బ్రేక్ ఈవెన్..?ఎంత వసూళ్లు వచ్చాయంటే!

Swag Collection: క్యారక్టర్ ఆరిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరో గా మారి, తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. రీసెంట్ గానే ఆయన ‘సామజవరగమనా’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలతో రెండు సూపర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన హసిత్ హోలీ అనే నూతన దర్శకుడితో కలిసి ‘స్వాగ్’ అనే చిత్రంలో నటించాడు. టీజర్ , ట్రైలర్ తోనే ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని తెచ్చుకుంది. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ముఖ్య పాత్రలో కనిపించింది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా టాలీవుడ్ లో ఆలోచించని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు డైరెక్టర్ హసిత్ హోలీ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. టాక్ బాగా రావడంతో ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ ద్వారా దాదాపుగా 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గంటకు రెండు నుండి మూడు వేల టికెట్స్ నిన్న అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఒక చిన్న హీరో సినిమాకి ఈ ట్రెండ్ ఉండడం నిజంగా గొప్ప విషయమే. అలాగే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇది శ్రీవిష్ణు మార్కెట్ రేంజ్ హీరోలకు చాలా మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 3 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపుగా 90 శాతం మొదటి రోజే రాబట్టింది. ఇది ఒక అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక సినిమాకి మొదటి రోజు 90 శాతానికి పైగా రికవర్ అయ్యినట్టు చరిత్రలో జరగలేదు. మొట్టమొదటసారి ఆ అరుదైన రికార్డు ఈ కుర్ర హీరో ఖాతాలో చేరింది. మొదటి రోజే ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి మొదటి రోజు తో సమానంగా టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోతున్నాయి. రెండవ రోజు కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే ఆవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
Oktelugu Epaper