Prabhas In OG: మరో 11 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో, మూవీ లవర్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు,బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ బాంబు లాగా పేలుతుంది. అందుకే ఆడియన్స్ లో ఈ చిత్రం పై అంతటి ఆసక్తి కలిగింది. రేపు ఈ చిత్రం నుండి ‘గన్స్ & రోజెస్’ పాట విడుదల కాబోతుంది. ఈ పాట ఫైర్ స్ట్రోమ్ కి మించి ఉంటుందని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ స్టఫ్ తో ఆడియన్స్ మెంటలెక్కిపోయేలా ఈ సినిమాని డైరెక్టర్ సుజీత్ తీర్చి దిద్దినట్టు మనకు ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తేనే తెలుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక లేటెస్ట్ వార్త అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తుంది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ ప్రెజెన్స్ అయితే కచ్చితంగా ఉంటుందట. అది క్యామియో రూపం లో కానీ, వాయిస్ రూపం లో కానీ, క్లైమాక్స్ లో ఓజీ కి ప్రభాస్ కి లింక్ ఉండేలా ఒక సన్నివేశాన్ని డిజైన్ చేసాడట డైరెక్టర్ సుజీత్. ఇది చాలా సీక్రెట్ గా దాచి పెట్టాడు కానీ , సోషల్ మీడియా యుగం లో సీక్రెట్స్ అసలు దాగవు కదా, పైగా సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. అందుకే ఈ మెయిన్ ట్విస్ట్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇది తెలిసిన వెంటనే ప్రభాస్ అభిమానులు చాలా థ్రిల్ కి గురి అవుతున్నారు. తమ అభిమాన హీరో పవర్ స్టార్ తో కలిసి చూస్తే అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలుగుతుందని, సెప్టెంబర్ 25 వరకు వేచి ఉండలేము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్ ఇందులో సాహూ గా కనిపించనున్నాడు అట. ఓజీ మరియు సాహూ కి మధ్య వచ్చే క్లాష్ పార్ట్ 2 లో చూడబోతున్నాం అన్నట్టుగా సినిమా ముగుస్తుందని టాక్. మనం విన్నది నిజమైతే ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మూవీ టీం అయితే ఈ రూమర్ బయటకు వచ్చినప్పుడల్లా ఫేక్ అంటూ క్లారిటీ ఇస్తుంది. బహుశా సస్పెన్స్ చెడిపోకూడదు అని వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చేమో అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18న విడుదల చేయబోతున్నారట మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 20 వ తేదీన వైజాగ్ లో నిర్వహించబోతున్నారు.