Loan: అవసరానికి ఒకప్పుడు డబ్బు ఇతరులు ఇచ్చేవారు. దానిపై వడ్డీ కూడా బాగానే ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకులో వెంటపడి మరీ లోన్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వారికి.. కారు కొనుక్కునేవారికి.. ఏదైనా అత్యవసర సమయంలో రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకు లోన్ మంజూరు కావాలంటే ఎంతో ప్రయాస ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఫోన్లోనే డాక్యుమెంటేషన్ పూర్తి చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఈ లోన్ విషయంలో పొరపాట్లు జరగవచ్చు. ఒక వ్యక్తి తాను లోన్ తీసుకోకుండానే ఈఎంఐ క్రియేట్ కావచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తికి తెలియకుండా మరొకరు రు ణం తీసుకుని అవకాశం కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మొబైల్ ద్వారా కొన్ని మోసాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న పొరపాట్ల వల్ల భారీ మొత్తంలో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సైతం నిత్యం సూచిస్తున్నారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్ల వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి తనకు తెలియకుండానే వేరొకరు ఋణం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకు వారు చేసే పొరపాట్ల వల్ల లోన్ క్రియేట్ కావచ్చు.
అయితే ఎప్పటికప్పుడు తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ? అనే విషయాన్ని సిబిల్ స్కోర్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. సివిల్ స్కోర్ బాగా ఉంటే ఎలాంటి సమస్యలు లేవని.. ఈ స్కోర్ తక్కువ ఉందంటే ఏదో సమస్య ఉందని గుర్తుంచుకోవాలి. అయితే సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నప్పుడు తేడా ఉంటే వెంటనే ఫుల్ సిబిల్ స్కోర్ రిపోర్ట్ తీసుకోవాలి. సాధారణంగా సిబిల్ స్కోర్ చూడడానికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫుల్ రిపోర్ట్ కావాలంటే మాత్రం బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫుల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అందులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వెంటనే గుర్తించవచ్చు. అంతేకాకుండా మనకు తెలియకుండా ఎవరైనా లోన్ తీసుకున్నారా? లేదా ఆటోమేటిగ్గా లోన్ క్రియేట్ అయిందా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
అయితే ప్రతిసారి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేనప్పుడు.. కొన్ని వెబ్సైట్లో ద్వారా లాగిన్ అయితే ఆ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్ రిపోర్టును వాట్సాప్ కు పంపుతూ ఉంటారు. ఇలా ప్రతినెలా సిబిల్ స్కోర్ వాట్సాప్ కు పంపిన తర్వాత చెక్ చేసుకుంటే ఎలాంటి సమస్య అయినా వెంటనే గుర్తించవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు సివిల్ స్కోర్ తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై నిర్లక్ష్యం చేస్తే కొన్ని రోజుల తర్వాత భారీగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.