Mirai Movie Collection: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. నిర్మాతలు చెప్తున్నా లెక్కల ప్రకారం ఈ సినిమాకు రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సాధారణంగా ఏ సినిమా నిర్మాత అయినా వచ్చిన డబ్బులకంటే ఎక్కువ డబ్బులు వచ్చినట్టుగా పోస్టర్స్ లో వేసి చూపిస్తుంటారు. కానీ మిరాయ్ నిర్మాతలు అలా చేయడం లేదు. ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో, అంతే పోస్టర్స్ లో వేసే ప్రయత్నం చేశారు. 55 కోట్ల రూపాయిల గ్రాస్ అని చెప్పారు కానీ, ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చింది 53 కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మొదటిరోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 8 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాలకు కూడా ఈ రేంజ్ షేర్ వసూళ్లు రాకపోవడం గమనార్హం. మూడవ రోజు అయితే రెండవ రోజు కంటే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవుతున్నాయట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం కచ్చితంగా రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. హిందీ లో కూడా రెండవ రోజున ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఓవర్సీస్ లో కూడా రెండవ రోజున ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.
ఓవరాల్ గా చూస్తే రెండవ రోజున ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఈరోజు 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయట. అలా ఓవరాల్ గా ఈ చిత్రం మూడు రోజుల్లో 85 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయని, బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అవలీల గా దాటిందని అంటున్నారు. మరి ఇదే రేంజ్ స్టడీ రన్ ని ఈ చిత్రం రేపటి నుండి కూడా కొనసాగించగలిగితే ఫుల్ రన్ లో ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి. ‘హనుమాన్’ చిత్రం దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మిరాయ్ చిత్రం కనీసం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అయినా రాబడుతుందో లేదో చూడాలి.