Homeఎంటర్టైన్మెంట్Trivikram Comments on Sushanth : సుశాంత్‌ అందులో ఇరుక్కుపోయాడు - త్రివిక్రమ్

Trivikram Comments on Sushanth : సుశాంత్‌ అందులో ఇరుక్కుపోయాడు – త్రివిక్రమ్

Trivikram comments on SushanthTrivikram Comments on Sushanth: సుశాంత్ (Sushanth), మీనాక్షి హీరో హీరోయిన్లుగా ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు త్రివిక్రమ్‌ వచ్చాడు. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ తనదైన శైలిలో ఒక స్పీచ్ వదిలాడు. ఇప్పుడు ఆ స్పీచ్ బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ త్రివిక్రమ్ ఏం మాట్లాడాడు అంటే..

త్రివిక్రమ్ (Trivikram) మాటల్లో.. ‘ఈ కరోనా కాలంలో నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి రావడానికి సాహసిస్తున్న జాతి… తెలుగుజాతి మాత్రమే అంటూ తెలుగు ప్రేక్షకుల ధైర్యసాహసాల గురించి త్రివిక్రమ్ సగర్వంగా చాటి చెప్పాడు. ఇక సుశాంత్ సినీ కెరీర్ పై కూడా త్రివిక్రమ్ ఇన్ డైరెక్ట్ గా వారసుల ఎంట్రీ గురించి చెప్పుకొచ్చాడు. హీరో అంటే ఇలా లాంచ్‌ అవ్వాలేమో.. లేదు ఇలాంటి సినిమాలు మాత్రమే చేయాలేమో అనే చట్రంలో సుశాంత్‌ ఇన్నేళ్లు ఇరుక్కుపోయాడు. కానీ సుశాంత్ రూట్ మార్చాడు. కొత్తగా ట్రై చేస్తున్నాడు. అందుకు ఉదాహరణనే.. ‘చిలసౌ’ సినిమా. ఆ చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అన్నిటికీ మించి తనను తానూ కొత్తాగా ఆవిష్కరించుకున్నాడు.

నేను ‘చిలసౌ’ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అతన్ని అడిగాను. ఇప్పుడు సుశాంత్‌ కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ త్రివిక్రమ్‌ తెలిపాడు. అయితే ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో వస్తోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా అవుట్ ఫుట్ విషయంలో మాత్రం ఇండస్ట్రీలో బ్యాడ్ టాక్ నడుస్తోంది.

ఇక హీరో సుశాంత్‌ కూడా ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ.. నా కెరీర్‌ స్టార్టింగ్‌ లో నేను కష్టపడాలి అనుకునేవాణ్ణి. కానీ నాకు అప్పుడు క్లారిటీ లేదు. ఎలాంటి సినిమాలు చేయాలో.. నేను ఏ డైరెక్షన్‌ లో ముందుకు వెళ్లాలో నాకు ఆ సమయంలో సరిగ్గా అర్థమయ్యేది కాదు. గట్‌ ఫీలింగ్‌ తో నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి నా కెరీర్ మారుతూ వస్తోంది’ అంటూ సుశాంత్‌ చెప్పుకొచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version