https://oktelugu.com/

సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఏదో దాస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ముంబై పోలీసులు రెండు నెలలుగా విచారణ జరిపి తేల్చింది ఏమీ లేదు. కానీ సుశాంత్ నివాసం ఉండే సీసీ టీవీ ఫుటేజ్ ఇమేజ్ లను కూడా సంపాదించలేదు. అనుమానితులను కనిపెట్టలేదు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ సినీ మాఫియా ఉందనే అనుమానులున్నాయి. Also Read: ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్! ఈ క్రమంలోనే రంగంలోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2020 / 10:10 AM IST
    Follow us on


    బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఏదో దాస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ముంబై పోలీసులు రెండు నెలలుగా విచారణ జరిపి తేల్చింది ఏమీ లేదు. కానీ సుశాంత్ నివాసం ఉండే సీసీ టీవీ ఫుటేజ్ ఇమేజ్ లను కూడా సంపాదించలేదు. అనుమానితులను కనిపెట్టలేదు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ సినీ మాఫియా ఉందనే అనుమానులున్నాయి.

    Also Read: ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

    ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పకడ్బందీగా విచారణ జరుపుతున్నారు. కీలక విషయాలను ఆరాతీస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృతంగా విచారణ జరుపుతోంది.ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా బాంద్రాలోని నివాసంలో సుశాంత్ డెత్ సీన్ ను రీక్రియేట్ చేశారు.

    ఈ విచారణలో సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం సేకరించారు.‘సుశాంత్ ఉదయం 8 గంటలకు గది నుంచి బయటకు వచ్చి నీరు అడుగగా తాను తీసుకెళ్లి ఇచ్చానని.. ఆ తర్వాత నవ్వుతూ తన గదిలోకి వెళ్లారని’ నీరజ్ సింగ్ తెలిపారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు తనను అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకొని రమ్మని సార్ గదిలోకి వెళ్లారని.. తాను తీసుకురాగా కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే సుశాంత్ తాగాడని నీరజ్ సింగ్ వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గదిలోకి వెళ్లి లాక్ వేసుకున్నాడని.. పిలిచినా స్పందన లేదని వివరించాడు. ఈ విషయాన్ని కిందనున్న దీపేష్, సిద్ధార్త్ లకు చెప్పగా వారు వచ్చి డోర్ కొట్టినా స్పందన రాలేదు. సుశాంత్ ఫోన్ కు కాల్ చేసినా స్పందన రాలేదు.

    ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు దీదికి ఫోన్ చేసి చెప్పామని.. ఆమె గది తలుపులు తెరవమని మాకు చెప్పారని నీరజ్ వివరించారు. ఒక తాళం తీసే వ్యక్తిని తీసుకొచ్చి ప్రయత్నించి విఫలమయ్యారని.. ఆ తర్వాత తామంతా తలుపులు పగులకొట్టి గదిలోకి ప్రవేశించామని.. సుశాంత్ సోదరి వచ్చారని.. ఫ్యాన్ కు వేలాడుతూ సుశాంత్ కనిపించాడని నీరజ్ సింగ్ వివరించాడు.. పోలీసులను పిలిపించామని తెలిపారు.

    Also Read: ఆర్జీవీకి షాక్‌.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్

    సుశాంత్ డెత్ సీన్ క్రియేషన్ తర్వాత అతడి పడకకు సీలింగ్ కు ఉన్న ఫ్యాన్ మధ్య దూరాన్ని సీబీఐ అధికారులు అంచనావేసి అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే సుశాంత్ దేహానికి పైన, కింద ఉన్న బెడ్ మధ్య ఉన్న పొడవుపై అనుమానించారు. ఎందుకంటే సుశాంత్ పొడవుపై అనుమానాలు వచ్చాయి. సుశాంత్ 6 ఫీట్లు హైట్ అని రాశారు. కానీ సుశాంత్ పోస్ట్ మార్టంలో అతడి హైట్ కేవలం 5.10 ఫీట్లు అని తేలింది. ఈ క్రమంలోనే సీలింగ్ ఫ్యాన్ కింద బెడ్ కు మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో సీబీఐ అధికారులు ఇది హత్యనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే సుశాంత్ ఉరివేసుకున్నాడా? లేదా అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత ఎవరైనా ఫ్యానుకు ఉరివేశారా అన్న కోణంలో సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.