గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్

అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అతని గెలవడం చాలా కీలకం. కరోనా వైరస్ నేపథ్యంతో పాటు అతని సొంత తప్పిదాలతో ఇప్పటికే అమెరికా మొత్తం విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడు. గత ఎన్నికల్లో స్థానిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయం సాధించిన ట్రంప్… ఈసారి మాత్రం భారత దేశ ప్రధాని […]

Written By: Kusuma Aggunna, Updated On : August 25, 2020 10:31 am
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అతని గెలవడం చాలా కీలకం. కరోనా వైరస్ నేపథ్యంతో పాటు అతని సొంత తప్పిదాలతో ఇప్పటికే అమెరికా మొత్తం విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడు. గత ఎన్నికల్లో స్థానిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయం సాధించిన ట్రంప్… ఈసారి మాత్రం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ను నమ్ముకున్నాడు.

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

విషయం ఏమిటంటే…. ప్రవాస భారతీయుల సంఖ్య అమెరికాలో చాలా అసాధారణంగా ఉంటుంది. వారు ఏకంగా అమెరికా దేశ అధ్యక్షుడి పదవిని ప్రభావితం చేయగల సమర్ధత కలిగిన వారు. ఇక ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రకటనల లో నమస్తే ట్రంప్ హౌడీ మోదీ వీడియోలను ఆయన వాడుకున్నారు. అయితే మరోసారి విజయం సాధించడం అంత ఈజీ కాదు అన్న విషయం కూడా తెలుసు. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడం అనేది అసాధ్యం అంటున్నారు.

ఇకపోతే ప్రత్యర్ధి పార్టీ నుండి ఉపాధ్యక్ష పదవికి ఎంతో వ్యూహాత్మకంగా భారత సంతతికి చెందిన కమలా హరిస్ ను బరిలోకి దిగడంతో…. ప్రవాస భారతీయుల మద్దతు కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు…. దాని తర్వాత ట్రంప్ అప్పుడు ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ట్రంప్ భారత్ కి వచ్చినప్పుడు మోడీ అహ్మదాబాద్లో పెద్ద మీట్ ఏర్పాటు చేయగా ఇద్దరు ఎంతో సాన్నిహిత్యం గా కనిపించారు. ఒకరినొకరు మెచ్చుకుంటూ మాటలు కూడా మాట్లాడారు. దీన్ని మొత్తం కలిపి ఎన్నికల ప్రచారం కోషం చక్కటి వీడియో తయారు చేసింది ట్రంప్ టీమ్. ఇది చూస్తే ప్రవాస భారతీయులు కచ్చితంగా తనకు ఓటు వేస్తారన్న బలమైన నమ్మకం ట్రంప్ ది.

Also Read : అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలుస్తారా?

ఇక ఇదంతా పక్కన పెడితే ‘అమెరికా లవ్స్ ఇండియా అమెరికా రెస్పెక్ట్ ఇండియా’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వీడియోలో జతపరిచి బ్రహ్మాండమైన యాడ్ ను ఎన్నికల బృందం తయారు చేశారు. మొత్తంగా ప్రవాస భారతీయుల ఓట్ల కోసం తెగ కష్టపడుతున్న ట్రంప్ కు అది ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్నది అతనికే తెలియాలి. మనకూ తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే…!