https://oktelugu.com/

నిరుద్యోగ యువతకు జగన్ గుడ్ న్యూస్

ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యనే. ఎందుకంటే ఈ కరోనాతో కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. అందరూ ఇంటికే వచ్చి ఉపాధి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల కల్పన మృగ్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీలోని నిరుద్యోగుల పాలిట వరంగా మారారు సీఎం జగన్. Also Read: జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా? ఎక్కడ ఎలా ఉపాధి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2020 / 10:37 AM IST
    Follow us on


    ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యనే. ఎందుకంటే ఈ కరోనాతో కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. అందరూ ఇంటికే వచ్చి ఉపాధి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల కల్పన మృగ్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీలోని నిరుద్యోగుల పాలిట వరంగా మారారు సీఎం జగన్.

    Also Read: జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

    ఎక్కడ ఎలా ఉపాధి సృష్టించవచ్చో సీఎం జగన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటుంటారు. అప్పట్లో 1080 అంబులెన్స్ సర్వీసులు ప్రవేశ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన జగన్.. ఇప్పుడు మరోసారి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించి మరీ నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. సీఎం జగన్ చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి.

    మొన్నటి కేబినెట్ భేటిలో లబ్ధిదారులకు ఇంటికే బియ్యాన్ని సరఫరా చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ఏకంగా 9260 వాహనాలను కొని ఇచ్చేందుకు సిద్ధం చేసింది.

    ఏపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇంటికే చేరవేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తరుఫున 9260 వాహనాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాలు ఇచ్చి ఇంటింటికి బియ్యం సరఫరా చేసే ఉద్యోగాలను కట్టబెడుతోంది.

    స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగులకు ఈ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ వాహనాలు కొనుగోలుకు 60శాతం సబ్సిడీ, 30శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పదిశాతం డబ్బు చెల్లించి యువత వాహనం సొంత చేసుకోవచ్చు.

    Also Read: అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

    ఇక ఈ లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హామీ ఇచ్చేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల పేరుతోనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. వాహనాల సబ్సిడీ కోసం 331 కోట్లు లోన్ తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఖర్చులతో కలిపి బియ్యం డోర్ డెలివరీకి ప్రతీ ఏడాది 776.45 కోట్ల రూపాయలు అదనపు నిధులు మంజూరు చేశారు.

    ఇలా లబ్ధిదారులకే వాహనం కొనిచ్చి.. అది ప్రభుత్వమే భరించి వారికి ఉపాధిని కల్పిస్తూ సీఎం జగన్ నిరుద్యోగుల పాలిట ఆశాకిరణంలా మారారు. లేనిచోట కూడా కొత్త ఉద్యోగాలు సృష్టించిన సీఎం జగన్ కు నిరుద్యోగులు నీరాజనం పలుకుతున్నారు. పాలాభిషేకాలతో ఏపీ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.