Mahesh-Rajamouli movie : మహేష్-రాజమౌళి మూవీ ‘కంగువ’ చిత్రానికి కాపీ గా రాబోతోందా..? స్టోరీ మొత్తం లీక్ అయిపోయిందిగా!

అప్పటి నుండి ఇప్పటి వరకు మహేష్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మీదనే పని చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన ఒక సినిమా చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకునేవాడు, కానీ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నాడంటే, ఆయన ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తీయబోతున్నాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం.

Written By: Vicky, Updated On : October 31, 2024 9:27 pm

Mahesh-Rajamouli movie

Follow us on

Mahesh-Rajamouli movie : ఎన్నో ఏళ్ళ నుండి మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో 2010 వ సంవత్సరం లో వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అయితే, ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చింది. ఈ సినిమాకి సమందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో రాజమౌళి నిమగ్నమై ఉన్నాడు. #RRR చిత్రం విడుదలై మూడేళ్లు కావొస్తుంది. ఆ సినిమా విడుదల తర్వాత ఒక ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్న రాజమౌళి, అప్పటి నుండి ఇప్పటి వరకు మహేష్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మీదనే పని చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన ఒక సినిమా చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకునేవాడు, కానీ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే రెండేళ్ల సమయం తీసుకున్నాడంటే, ఆయన ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తీయబోతున్నాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం.

ఎందుకు ప్రీ ప్రొడక్షన్ కి ఇంత సమయం పడుతుందంటే ఆయన తీసుకున్న జానర్ అలాంటిది కాబట్టి. ఇప్పటి వరకు ఈ జానర్ మీద ఇండియాలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని, హాలీవుడ్ నటీనటులను దింపుతున్నాడు. ఒక సరికొత్త ప్రపంచాన్ని వెండితెర మీద ఆవిష్కరించేందుకు రాజమౌళి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. పీరియడ్, హిస్టారికల్ మరియు కమర్షియల్ సినిమాలను పెద్ద స్పాన్ లో తెరకెక్కించాలి అనుకున్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఆ జానర్ లో తెరకెక్కి సక్సెస్ అయిన పాత సినిమాల రిఫరెన్స్ ని తీసుకుంటారు. కానీ ఇప్పుడు రాజమౌళి తీయబోయే ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ సినిమా తీయలేదు కాబట్టి ఆయనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఇంత సమయం పడుతుంది. కానీ వచ్చే నెలలో విడుదల కాబోతున్న సూర్య ‘కంగువ’ చిత్రానికి, మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయట. కంగువ సినిమా మొత్తం అడవి నేపథ్యంలోనే కొనసాగుతుందట.

ఇప్పటికే మనం టీజర్స్, ట్రైలర్స్ చూస్తేనే అర్థం అవుతుంది, ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో. ‘కంగువ’ విడుదలై పెద్ద హిట్ అయితే, రాజమౌళి ఈ సినిమాలోని కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తన సినిమాకి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇలాంటివన్నీ చాలానే చేసాడు. బాహుబలి, మగధీర, విక్రమార్కుడు, సింహాద్రి ఇలా ఆయన తీసిన ప్రతీ సినిమా హాలీవుడ్ నుండి రిఫరెన్స్ తీసుకొని చేసినవే. ‘కంగువ’ చిత్రం కాస్త ముందుగా విడుదల అయ్యుంటే, రాజమౌళి కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కాస్త సమయం కలిసొచ్చే అవకాశం ఉండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు. మరి నవంబర్ 14 న విడుదల కాబోతున్న ‘కంగువ’ చిత్రం రాజమౌళి కి ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి.