Anushka : ఇక అనుష్క సినిమా కెరియర్ క్లోజ్ అయినట్టేనా..? ఆమె సినిమాలు చేయడం లో ఎందుకు ఆక్టివ్ గా లేదు…

 ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటి నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటే తప్ప ఇక్కడ స్టార్ హీరోలుగా, హీరోయిన్లు గా కొనసాగలేరు. కాబట్టి ఎవరికి వారు వాళ్ల స్టైల్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ని అందుకోవాలంటే మాత్రం వాళ్ళు సక్సెస్ లతోపాటు ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది

Written By: Gopi, Updated On : October 31, 2024 7:50 pm

Anushka Shetty

Follow us on

Anushka : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ సినిమాతో పరిచయం అయిన అనుష్క తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆమె చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ రావడమే కాకుండా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ను కూడా దక్కించుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో ఆమెకి భారీ క్రేజ్ అయితే దక్కింది. ఇక ఆ క్రేజ్ ని వాడుకోడానికే ఆమె చాలా వరకు ప్రయత్నం చేస్తూ వచ్చింది. సినిమాలో తన నటనకి ప్రేక్షకులు సైతం నివ్వెర పోయారు. ఇక అలాంటి సందర్భంలోనే ఆమె నటిగా కాకుండా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే కొన్ని సినిమాల కోసం ఆమె విపరీతంగా బరువు పెరిగిపోయింది. దానివల్ల ఆమెకి అవకాశాలైతే రావడం లేదు. ఇక ఆమె బరువు తగ్గడానికి ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కావడం లేదు. దాంతో ఆమె కంటే ముందు వచ్చిన హీరోయిన్లు సైతం ఇప్పటికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంటే ఆమె మాత్రం సినిమాల విషయంలో చాలావరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి.

స్టార్ హీరో కి ఉన్న రేంజ్ ఆమెకు ఉన్నప్పటికీ ఆమె ఎందుకు ఇలా సినిమాలను నెగ్లెట్ చేస్తుంది అనే విషయాల మీదనే సరైన అభిప్రాయం అయితే రావడం లేదు. నిజానికి అనుష్కలాంటి నటి చేత మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

బరువును తగ్గించుకొని మళ్ళీ స్లిమ్ గా తయారైతే చాలా మంచి అవకాశాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆమె సినిమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తోంది. అందువల్లే తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ప్రత్యేకించి కొన్ని క్యారెక్టర్ల కోసం బరువు తగ్గాల్సి వస్తే మాత్రం తగ్గలేకపోతుంది కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోవడంతో ఆమె అభిమానులు చాలా వరకు ఇబ్బందికి గురవుతున్నారు.

నిజానికి ప్రభాస్, గోపీచంద్, రానా లాంటి నటుల పక్కన అనుష్క చాలా బాగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ సిక్స్ ప్లస్ హైట్ తో ఉంటారు. కాబట్టి అనుష్కకి ఈడు జోడుగా కూడా చాలా బాగా సెట్ అవుతారు. మరి ఇలాంటి సందర్భంలో ఈమె సినిమాలను ఎందుకు చేయడం లేదు. అనే దాని మీదనే ఇప్పుడు పలు రకాల చర్చలైతే జరుగుతున్నాయి…