Suriya Karuppu OTT Release: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని , సునామీ లాంటి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘ కరుప్పు’. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య కు , ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఒక్కసారిగా ఆయన దిక్కుతోచని తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఈ సినిమాతో గాడ్ ఫాదర్ లాగా మారిపోయాడు. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. వీకెండ్ లో డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటూ , బయ్యర్స్ కి లాభాలు కురిపిస్తూనే ఉంది ఈ చిత్రం. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకు 10 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ గురించి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసింది. వాళ్ళతో మేకర్స్ కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యాలి. అందుకే ఈ నెల 12 న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం వెర్షన్స్ లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ‘కరుప్పు’ చిత్రానికి పాజిటివ్ టాక్ తో పాటుగా , నెగెటివ్ టాక్ కూడా సమాంతరంగా వచ్చింది.
కానీ తమిళం లో ఆరు నెలల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం, ఆడియన్స్ కరువులో ఉండడం వల్ల , ఈ సినిమాని ఎగబడి చూసారు అనేది కొందరి వాదన. అందులో ఎంత మాత్రం నిజముంది అనేది , ఓటీటీ రిలీజ్ తో తేలిపోనుంది. చాలా సూపర్ హిట్ సినిమాలకు థియేటర్స్ లో వచ్చినంత రెస్పాన్స్ ఈమధ్య కాలం లో ఓటీటీ లో రావడం లేదు , అదే సమయం లో కొన్ని ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత సూర్య ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ‘విశ్వనాధ్ & సన్స్ ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ‘కరుప్పు’ కారణంగా ఈ చిత్రానికి అటు తమిళం లో ఎంత డిమాండ్ పెరిగిందో , తెలుగులో కూడా అదే రేంజ్ డిమాండ్ పెరిగింది.
