Homeఎంటర్టైన్మెంట్Ram Charan Daughter Klin Kaara Viral Video: 'పెద్ది' హిట్ అయ్యినందుకు పూజలు చేస్తున్న...

Ram Charan Daughter Klin Kaara Viral Video: ‘పెద్ది’ హిట్ అయ్యినందుకు పూజలు చేస్తున్న రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. వీడియో వైరల్..

Ram Charan Daughter Klin Kaara Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం , మెగా ఫ్యాన్స్ కి , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ నుండి రామ్ చరణ్ చేసిన సినిమాల్లో #RRR మినహా మరో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. #RRR లో ఆయన మెయిన్ హీరో […]

Ram Charan Daughter Klin Kaara Viral Video: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం , మెగా ఫ్యాన్స్ కి , రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ నుండి రామ్ చరణ్ చేసిన సినిమాల్లో #RRR మినహా మరో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. #RRR లో ఆయన మెయిన్ హీరో కాబట్టి , ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది కాబట్టి , కచ్చితంగా ఆయనకు గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ , క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ #RRR కి ముందు వినయ విధేయ రామ , #RRR తర్వాత ఆయన చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి.

అలాంటి సమయం లో ‘పెద్ది’ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా చేసింది , అదే విధంగా మామూలు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. కేవలం మొదటి వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం , ఫుల్ రన్ లో 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సందర్భంగా అభిమానులు ఎంత ఆనందిస్తున్నారో , రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా కూడా అదే రేంజ్ లో ఆనందిస్తోంది.

తెలిసి తెలియని వయస్సులో , తన తండ్రి మీద ఈ చిన్నారి చూపిస్తున్న ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గానే ఈ చిన్నారి తన తండ్రికి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ, తన ఇంటి స్టాఫ్ తో చికిరి చికిరి రీల్ చేయించింది. ఈ రీల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. అదే విధంగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , తన తాతయ్య చిరంజీవి మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దేవుడికి పూజ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో క్లిన్ కారా ఎంతో క్యూట్ గా కనిపించింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Praveen ♥️ (@aku_lapraveen)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper