Hero Surya : ఒకప్పుడు సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మంచి మార్కెట్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూర్య. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత దయనీయంగా మారింది. ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలు కూడా అవలీలగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతున్న రోజులివి. కానీ సూర్య మాత్రం ఇంకా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వద్దే ఆగిపోయాడు. అది కూడా రీసెంట్ గా విడుదలైన ‘కంగువా’ చిత్రంతోనే ఆయన వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. సుమారుగా 300 కోట్ల రూపాయిలను ఖర్చు చేసి, భారీగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశారు.
విడుదలకు ముందు ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉండేవి. నిర్మాతలు 2000 కోట్లు కొడుతుందని సవాళ్లు విసిరారు. కానీ చివరికి వంద కోట్ల మార్కుని అందుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా సూర్య కి మంచి సబ్జెక్టు పడితే సౌత్ ఇండియా మొత్తాన్ని షాక్ చేసేంత సత్తా ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ తమిళ దర్శకులు ఆయన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు. అందుకే సూర్య కొంత కాలం తమిళ సినిమా ఇండస్ట్రీ కి బ్రేక్ ఇచ్చి, తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తున్నాడు. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి పర భాషకి సంబంధించిన హీరోలు ఇక్కడ సినిమాలు చేసి కెరీర్ లోనే భారీ హిట్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే సూర్య కూడా వాళ్ళ దారిలో నడుస్తున్నాడుఇ. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి త్వరలోనే సూర్య తో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఒకప్పుడు లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈమధ్య కాలం లో తన పంధాని మార్చుకొని సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. సూర్య తో ఆయన చేయబోయే సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందట. మారుతీ సుజుకీ కారు మన ఇండియా కి ఎలా వచ్చింది?, దాని నేపథ్యం ఏమిటి అనే బ్యాక్ డ్రాప్ లో ఆయన కథని రాసుకున్నాడట. రీసెంట్ గానే ఈ కథ సూర్య ని కలిసి వినిపించగా, ఆయనకు చాలా బాగా నచ్చినట్టు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కనుంది. ప్రస్తుతం సూర్య కార్తీ సుబ్బరాజ్ దర్శకత్వం చేసిన సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ప్రస్తుతం ఆయన తన ఫోకస్ మొత్తం ఈ చిత్రం మీదనే పెట్టి ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే వెంకీ అట్లూరి తో సినిమా చేయనున్నాడు సూర్య.