Train : ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలి అంటే ఎక్కువగా ట్రైన్ ను ఎంచుకుంటారు. ఈ ట్రైన్ ద్వారా రవాణా సులభం అవుతుంది. బస్, కారు వంటివి కొన్ని సార్లు ఇబ్బంది పెడతాయి. ముందుగా బుక్ చేసుకొని ట్రైన్ జర్నీ చేస్తే మీ జర్నీ సులభం అవుతుంది. అయితే ఈ జర్నీలో కొన్ని సార్లు లగేజ్ ను మర్చిపోతారు. విలువైన సామాన్లు మర్చిపోతారు. మరికొన్ని సార్లు రీల్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ లేదా ఛార్జింగ్ పెడుతూ ఫోన్ ను బయట పడేసుకుంటారు. అది రైల్వే ట్రాక్ పైన పడిపోతుంది. అలాంటప్పుడు మీ ఫోన్ ను ఎలా తీసుకోవాలి. మధ్యలో తీసుకుందాం అంటే అది బస్ కాదు కద ఆగడానికి. మరి ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదివేసేయండి.
మన భారతీయ రైల్వే ప్రపంచంలో అతి పెద్ద నాల్గవ రైల్వే వ్యవస్థ. బస్సులు, కార్లు, విమానాలతో పోలిస్తే ట్రైన్ టికెట్ చాలా తక్కువ. అందుకే ఈ రవాణాను ఎంచుకుంటారు చాలా మంది. ధర తక్కువ, సేఫ్ ఎక్కువ. సో ట్రైన్ ఎంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కదా.
ఇక రైల్లో ప్రయాణిస్తుంటే కొందరు డోర్ దగ్గర నిల్చొని మరీ జర్నీ చేస్తుంటారు. అదొక థ్రిల్ ను ఇస్తుంది కూడా. మరికొందరు విండోకి దగ్గర కూర్చొంటారు. బయట పరిసరాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో సెల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం కూడా కామన్. మరికొందరు ఈ రైలు ఎక్కే హడావుడిలో హ్యాండ్ బ్యాగ్ లు, పర్సులు కూడా పడేసుకుంటారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురు అయిందా? ఇలా జరిగినప్పుడు ఆ వస్తువు దొరకదు అని నిరాశ పడుతారు. కానీ ఇప్పటి నుంచి ఆ చింత అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు జరిగితే జస్ట్ రైల్వే శాఖను సంప్రదించాలి. దీని ద్వారా వెంటనే పడిపోయిన మీ వస్తువు మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది.
రైలులో ప్రయాణించేటప్పుడు ట్రాక్ పై సెల్ ఫోన్ పడేసుకున్నారా? డోర్ దగ్గర నిల్చొని పడేసుకుంటారు. ఈ విధంగా మీ వస్తువులు పడిపోతే వాటిని తిరిగి పొందే అవకాశం ఉంది. మరి దీనికి మీరు ఏం చేయాలి అనుకుంటున్నారా? మీ ఫోన్ లేదా వస్తువు పడిపోతే అక్కడ ఉన్న రైల్వే పోల్స్ పై ఉండే పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న నెంబర్లను చూసి గుర్తు పెట్టుకోవాలి. వెంటనే ట్రైన్ లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా రైల్వే పోలీసులకు చెప్పాలి. ఇలా చెప్పిన వెంటనే వారు తమ సిబ్బందికి సమాచారం ఇస్తారు. దీని ద్వారా మీ వస్తువు రికవరీ చేయిస్తారు.
మీకు టీసీ అందుబాటులో లేకున్నా సరే 182 లేదా 139 నంబరుకి కాల్ చేయండి. మీ ఫోన్ పడిపోయిన చోటు, రైల్వే పోల్స్ నంబర్లు, దగ్గర్లో ఉన్న స్టేషన్, టైమ్ వంటి వివరాలు చెప్పడం వల్ల కూడా సమస్య సాల్వ్ అవుతుంది. వెంటనే వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ను పంపిస్తారు. మీ సెల్ ఫోన్ లేదా వస్తువును రికవరీ చేసి మీకు అప్పగిస్తారు. ఆలస్యం చేయవద్దు. లేదంటే ఆ వస్తువు ఇతరులకు లభించే అవకాశం ఉంది. లేదంటే మీరు తర్వాత స్టేషన్ లో దిగి స్టేషన్ మాస్టర్ ను కలిసి వివరాలు చెప్పడం వల్ల కూడా రికవరీ జోన్ ఆఫీసర్ ద్వారా వాళ్లు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.