https://oktelugu.com/

Mahesh Babu-Nani combination : మహేష్ బాబు, నాని కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? తెలుగు సినిమా ఇండస్ట్రీ గొప్ప క్లాసిక్ ని కోల్పోయిందిగా!

హేష్ బాబు, నాని కాంబినేషన్ చిత్రం ఒకటి ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తుంది కదూ. ఇద్దరూ కూడా కామెడీ టైమింగ్ విషయంలో కానీ, ఎమోషనల్ సన్నివేశాల్లో కానీ అద్భుతంగా చేస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 05:08 AM IST

    Mahesh Babu-Nani combination

    Follow us on

    Mahesh Babu-Nani combination : మన టాలీవుడ్ హీరోలు మల్టీ స్టార్రర్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. కానీ డైరెక్టర్స్ వీళ్ళని సరిసమానంగా చూపించగలమో లేదో అనే భయంతో ఎక్కువగా రిస్క్ చేసేవారు కాదు. ముఖ్యంగా నిన్నటి తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. కారణం డైరెక్టర్స్ అంత సాహసం చేయలేదు. కానీ ఈ జనరేషన్ హీరోలు మాత్రం ధైర్యం చేసి మల్టీస్టార్రర్ చిత్రాలు చేస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం నుండి మొదలైన ఈ ట్రెండ్, #RRR చిత్రంతో తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ ట్రెండ్ లో కొన్ని క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రాలు మిస్ అయ్యాయి. అందులో మహేష్ బాబు, నాని కాంబినేషన్ చిత్రం ఒకటి ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తుంది కదూ. ఇద్దరూ కూడా కామెడీ టైమింగ్ విషయంలో కానీ, ఎమోషనల్ సన్నివేశాల్లో కానీ అద్భుతంగా చేస్తారు.

    అలాంటి వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో చేస్తే ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ గా ఉంటుంది. మరి సెట్స్ మీదకు వచ్చిన ఈ క్రేజీ చిత్రం ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ముందుగా తీయాలనుకున్నది ‘గుంటూరు కారం’ కాదు. ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఒక్క షెడ్యూల్ కూడా చేసారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పై ఒక ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ సన్నివేశం ఔట్పుట్ మహేష్ బాబు కి అసలు నచ్చలేదు. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా లేకపోవడంతో రిస్క్ చేయలేక మహేష్ బాబు ఈ చిత్రాన్ని ఆపించేసి, గుంటూరు కారం తీయించాడు.

    అయితే ముందుగా తీద్దాం అనుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నేచురల్ స్టార్ నాని ఒక కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం లో విలన్ గా ప్రముఖ మలయాళం హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఎంపికయ్యాడు. మంచి క్రేజీ చిత్రం రాబోతుంది అని మహేష్ అభిమానులు ఆనదించేలోపు, ఈ చిత్రం అట్టకెక్కింది. ఒకవేళ ఈ సినిమా తెరకెక్కి విడుదల అయ్యుంటే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ మామూలుగా ఉండేది. కథ యావరేజ్ గా ఉన్నా సరైన నటులు సినిమాలో ఉంటే ఔట్పుట్ అదిరిపోతోంది. మహేష్, నాని వంటి టాలెంటెడ్ హీరోలకు కంటెంట్ లేని సన్నివేశాలను కూడా రక్తికట్టించే సత్తా ఉంది. అలాంటిది వీళ్లిద్దరు కలిసి సినిమా చేసుంటే వేరే లెవెల్ లో ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో చూద్దాం.