నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వ వైఖరి చూసిన రాజకీయ విశ్లేషకులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి నిమ్మగడ్డ వైఖరిపై మరోమారు విమర్శల వర్షం కురిపించారు. నిమ్మగడ్డకు కేసులు వేసేందుకు, అధిక పారితోషికం పుచ్చుకునే లాయర్లకు చెల్లించేందుకు రూ. కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులతో ప్రముఖ హోటళ్లలో ములాఖత్ గురించి ప్రస్తావించారు.
Also Read: టిడిపి నుంచి మరో వికెట్ డౌన్..!
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన నిమ్మగడ్డ తనను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ వినతి ప్రతాన్ని సమర్పించారు. అదేవిధంగా ఈ అంశంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయనకు స్వయంగా వివరించారు. దీంతో గవర్నర్ నిమ్మగడ్డ విషయంలో హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు. చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ అంటూ పక్కన పెట్టేసినట్లుగా ఉంది.
నిమ్మగడ్డ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ విచారణలో ఉండగా ఈ అంశంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని భావించినా అలా జరగలేదు. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న అంనతరం నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారించినా అది కోర్టు దిక్కార పిటీషన్ పై మాత్రమే ఆదేశాలు ఉంటాయని, హై కోర్టు ఆదేశించినట్లుగా నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలనే తీర్పుపై ఎటువంటి ప్రభావం ఉందని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.
Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!
కేసుల పేరుతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకుండా తాత్సారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిసుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపైపు హై కోర్టు ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిగిరి నియమించకపోవడాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. గత శుక్రవారం విచారణలో వారం రోజులు గడువు ఇస్తున్నామని ఇలోగా ఈ విషయాన్ని తేల్చాలని విచారణలో ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. హై కోర్టు తదుపరి విచారణలో ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.