Homeఎంటర్టైన్మెంట్నా బయోపిక్ కి ఆ స్టారే కరెక్ట్: రైనా

నా బయోపిక్ కి ఆ స్టారే కరెక్ట్: రైనా

బయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ రిలీజ్ కి రెడీ అవుతోన్న క్రమంలో.. క్రికెటర్ సురేష్ రైనా బయోపిక్ గురించి కూడా తాజాగా చర్చ జరిగింది. భారత మాజీ క్రికెటర్‌ గా సూరేశ్‌ రైనాకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సూరేశ్‌ రైనాను తన బయోపిక్‌ సంబంధించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్. ఒకవేళ […]

Rainaబయోపిక్ ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ రిలీజ్ కి రెడీ అవుతోన్న క్రమంలో.. క్రికెటర్ సురేష్ రైనా బయోపిక్ గురించి కూడా తాజాగా చర్చ జరిగింది. భారత మాజీ క్రికెటర్‌ గా సూరేశ్‌ రైనాకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్య్వూలో సూరేశ్‌ రైనాను తన బయోపిక్‌ సంబంధించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్.

ఒకవేళ మీ బయోపిక్ ను సౌత్‌ లో తీస్తే, మీ పాత్రలో ఏ హీరో నటించాలని మీరు భావిస్తున్నారు ? అని యాంకర్‌ ప్రశ్నించింది. అయితే ఆ ప్రశ్న పూర్తి కాకముందే వెంటనే రైనా మాట్లాడుతూ.. ‘నా పాత్రలో హీరో సూర్య నటిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రైనా సెలెక్షన్ బాగుంది. సూర్య అయితే పాత్రకు తగ్గట్టు మారుతూ తనదైన శైలిలో నటిస్తాడు కాబట్టి, తన పాత్రకు విలువ పెరుగుతుంది అని రైనా భావించి ఉండొచ్చు.

అయితే రైనా, సూర్య నటన గురించి కూడా గొప్పగా కామెంట్స్ చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతూ పోస్ట్ లు పెట్టారు. దాంతో రైనా సూర్య నటన బాగుంటుందని, ఆయన పాత్రలకు అనుగుణంగా తన శైలిని మార్చుకుని తనదైన నటనను కనబరుస్తాడని అందుకే సూర్య అంటే తనకు ఇష్టమని అంటూ మళ్ళీ సూర్య పై తన అభిమానాన్ని చూపించాల్సి వచ్చింది.

ఇక క్రికెటర్ల బయోపిక్ విషయానికి ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ యువరాజ్ సింగ్ బయోపిక్. యువరాజ్ లైఫ్ లో ఉన్న డ్రామా సినిమాకి మంచి ఫుటేజ్ అవుతుందని, అందుకే యువరాజ్ బయోపిక్ ను మేకర్స్ సినిమాగా తీసుకురావాలని, పైగా నిజమైన హీరో యువరాజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper