
Suresh Daggubati: తెలుగు సినిమా ఆడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ దే అగ్రస్థానం. ఆ మధ్య అల్లు అరవింద్ లాంటి మేటి నిర్మాతలు కూడా ఆడియో బిజినెస్ వైపు ఒక చూపు చూడాలనుకున్నారు. కానీ, అరవింద్ ఓటీటీలో బిజీ అయిపోయారు. మధ్యలో దిల్ రాజు కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అంతలో శంకర్ – చరణ్ సినిమాతో పాన్ ఇండియా సినిమాల నిర్మాణంతో బిజీ అయిపోయారు.
ఇక ఆ స్థాయి ఉండి ఖాళీగా ఉన్న ఏకైక నిర్మాత డి. సురేష్ బాబు(Suresh Daggubati). సురేష్ బాబు మంచి బిజినెస్ మెన్. లాభం లేనిది ఏ పని చేయరు. ఆయన గత కొంతకాలంగా అన్నీ గమనిస్తూ వచ్చారు. ఆదిత్య అన్ని సినిమా పాటలను తీసుకోవడం, ముఖ్యంగా యూట్యూబ్ హక్కులు తీసుకుని మంచి ఆదాయం సంపాదించడంలో బాగా ముదిరిపోయింది.
ఆదిత్యకు అందరికన్నా బాగా లాభాలు వస్తున్నాయి. అందుకే దగ్గుబాటి సురేష్ బాబు ఆడియో రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్య అందుకు సంబంధించిన అన్ని పనులను వేగవంతం చేశారు కూడా. ఎస్ పి మ్యూజిక్ అనే లేబుల్ ను ప్రారంభించి సక్సెస్ చేయడానికి సురేష్ పక్కా ప్లాన్ తో ముందుకుపోయారు.
ఈ ఎస్ పి మ్యూజిక్ లేబుల్ మీది అడియో, వీడీయో హక్కులు తీసుకుని క్యాష్ చేసుకోవాలనేది సురేష్ బాబు ప్లాన్. పైగా సురేష్ బాబుకి సురేష్ ప్రొడక్షన్స్ అనే పెద్ద సంస్థ ఉంది. అన్నిటికీ మించి చేతిలో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇక మిగిలిన హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా సురేష్ బాబుకు ఈ ఆడియో బిజినెస్ లాభదాయకమే.
అందుకే, ఇప్పటి వరకు తిరుగులేకుండా ఆడియో సామ్రాజ్యాన్ని ఏలిన ఆదిత్య ఇక భవిష్యత్తులో గట్టి పోటీ ఎదుర్కోబోతుంది. పైగా ఆ పోటీలో గెలిచే అవకాశం కూడా చాలా తక్కువ. ఏది ఏమైనా సురేష్ బాబు రంగంలోకి దిగాడు అంటే.. లాభమంతా వన్ సైడ్ అయిపోతుంది అంతే.
Also Read: రానా, వెంకీ కాంబినేషన్లో వెబ్‌సిరీస్!