
Pawan Kalyan Lala Bheemla: పవర్ స్టార్ స్టామినా ఏమిటో ‘లాలా.. బీమ్లా.. ‘ పాట ఘనంగా చాటి చెప్పింది. అయినా పవన్ మాస్ విజువల్స్ మీద ‘అడవి పులి.. గొడవ పడి.. ఒడిసి పట్టు.. దంచి కొట్టు.. కత్తి పట్టు.. అదరగొట్టు’’ అంటూ అద్భుతమైన బిల్డప్ షాట్స్ పడితే ఫ్యాన్స్ కు పూనకాలు రాకుండా ఎందుకు ఉంటాయి . అయితే, ఈ లాలా.. బీమ్లా.. సాంగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా పూనకాలు వచ్చాయి.
విడుదలైన గంట గంటకు రికార్డ్ వ్యూస్ తో సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది ఈ పాట. ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఈ సాంగ్ లైక్స్ అండ్ షేర్సే కనిపిస్తున్నాయి. అందుకే అతి సులభంగా కొత్త రికార్డులు నమోదు చేసింది ఈ క్రేజీ సాంగ్. ఇప్పటికే వ్యూస్ పరంగా సౌత్ ఇండస్ట్రీ లోనే హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన పాటగా ఈ పాట నిలిచిపోయింది.
అది కూడా కేవలం 24 గంటల్లోనే హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను గ్రాండ్ గా క్రియేట్ చేసింది. నిజానికి మిగిలిన ఏ హీరోకి కూడా ఈ ఘనత దక్కలేదు. అందుకే, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పటికీ పవర్ స్టారే. అందుకే 24 గంటల్లో 10 మిలియన్ల మార్క్ టచ్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్ గా పవర్ స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేయగలిగాడు.
మరి ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చిన ఈ ‘లాలా.. బీమ్లా.. ‘ సాంగ్ తర్వాత ప్లేస్ లో ఉన్న లిరికల్ సాంగ్స్ ఏమిటో చూద్దాం.
భీమ్లా నాయక్ నుంచి వచ్చిన లాలా భీమ్లా పాటకు ఇప్పటివరకు – 10.2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇంకా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తూనే ఉన్నాయి.
పుష్ప నుంచి వచ్చిన సామీ సామీ పాటకు ఇప్పటివరకు 9.06 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
పుష్ప నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక పాటకు ఇప్పటివరకు 8.32 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
భీమ్లా నాయక్ నుంచి వచ్చిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు ఇప్పటివరకు 8.28 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
సరిలేరు నీకెవ్వరు నుంచి వచ్చిన మైండ్ బ్లాక్ సాంగ్ కు ఇప్పటివరకు 7.87 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
అల వైకుంఠపురములో నుంచి వచ్చిన రాములో రాములా పాటకు ఇప్పటివరకు 7.39 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
పుష్ప నుంచి వచ్చిన శ్రీవల్లి పాటకు ఇప్పటివరకు 6.9 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
Also Read: ఆకట్టుకుంటున్న ‘భీమ్లనాయక్’ ప్రోమో సాంగ్