షార్ప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రస్తుతం ఒక స్టార్ హీరో కావాలి. మరి మెగాస్టార్ చిరంజీవితో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో సైరాను తీసిన తరువాత, మళ్ళీ ఏ మిడియమ్ రేంజ్ హీరోతోనో సినిమా చేస్తే.. ఏం బాగుంటుందనే ఫీల్ లో ఉన్నాడు సురేందర్ రెడ్డి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా సురేందర్ రెడ్డికి పేరు లేదు గాని, నిజంగా ఆ రేంజ్ టాలెంట్ ఉన్న డైరెక్టరే. దానిలో ఎలాంటి అనుమానం లేదు. కానీ, సక్సెస్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఫక్తు కమర్షియల్ ఇండస్ట్రీ అయ్యే సినిమా ఇండస్ట్రీ. అందుకే, సురేందర్ రెడ్డి స్టార్ హీరో కోసం వెతుక్కుంటున్నాడని తెలిసి కూడా ఏ స్టార్ హీరో, ఆయనను పిలిచి అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. పాపం సైరాతో సురేందర్ రెడ్డికి మిగిలింది ఏమి లేదు.
పైగా సంవత్సరాల తరబడి సై సై సైరా అంటూ కాలక్షేపం చేశాడు. ఈ లోపు ఇంకో స్క్రిప్ట్ కూడా తయ్యారు చేసుకోలేకపోయాడు. సైరాకి ముందు సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపే ఉంది. సైరా తరువాత కూడా అదే గుర్తింపు, ఆయన రేంజ్ మారలేదు, దానికితోడు ఏ స్టార్ హీరో ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేదు. కారణాలు ఎన్నో చెప్పొచ్చు, అదే సైరా, బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఉంటే.. సురేంధర్ రెడ్డి కోసం స్టార్ హీరోలంతా క్యూలో ఉండే వారు కాదా… ఏది ఏమైనా సురేంధర్ రెడ్డి స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీగా ఉన్నా.. ఆయనతో వెంటనే సినిమాని స్టార్ చెయ్యటానికి ఏ స్టార్ హీరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. చరణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఆల్ రెడీ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే తరువాత సినిమాలను ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..
చివరికి కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ కూడా గోపీచంద్ మలినేనితో, రమేష్ వర్మతో, ఆ తరువాత నక్కిన త్రినాథరావుతో వరస సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. మొత్తానికి ప్రభాస్ అయితేనే సురేంద్ర రెడ్డికి త్వరగా సినిమాని మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. నాగ్ అశ్విన్ తో మాత్రమే ప్రభాస్ కమిట్ అయ్యాడు. ఆ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న రాధే శ్యామ్ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందట. అంటే వచ్చే ఏడాది మొత్తం ప్రభాస్ ఖాళీ. మరి సురేంధర్ రెడ్డి గాని, ప్రభాస్ కి నచ్చే కథ పట్టుకెళ్ళితే అవకాశం ఉంటుంది. ఒకరకంగా ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రభాస్ ఒక్కడే దిక్కు.