వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆయుధం అదే?

టీడీపీ అధినేత చంద్రబాబుకు నో ఆప్షన్. ఇక అదే ఆయుధమని ఫిక్స్ అయిపోయారట.. అవును.. ఎన్నడూ లేనంత బలంగా అధికార వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. 40 ఇయర్స్ చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దూసుకొస్తున్న జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలు వాడేస్తున్న చంద్రబాబుకు ఇక ఎలా ఎదుర్కోవాలని బుర్రబద్దలు కొట్టుకుంటున్నాడట.. ఈ క్రమంలోనే ఇక ఉన్న ఏకైక అస్త్రం అదేనని డిసైడ్ అయినట్టు తెలిసింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కునారిల్లుతోంది. వయసైపోయిన చంద్రబాబు […]

Written By: NARESH, Updated On : July 20, 2020 9:40 am
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబుకు నో ఆప్షన్. ఇక అదే ఆయుధమని ఫిక్స్ అయిపోయారట.. అవును.. ఎన్నడూ లేనంత బలంగా అధికార వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. 40 ఇయర్స్ చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దూసుకొస్తున్న జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలు వాడేస్తున్న చంద్రబాబుకు ఇక ఎలా ఎదుర్కోవాలని బుర్రబద్దలు కొట్టుకుంటున్నాడట.. ఈ క్రమంలోనే ఇక ఉన్న ఏకైక అస్త్రం అదేనని డిసైడ్ అయినట్టు తెలిసింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కునారిల్లుతోంది. వయసైపోయిన చంద్రబాబు ఒకవైపు.. నాయకత్వ పగ్గాలు అందిపుచ్చుకోని నారా లోకేష్ మరోవైపు.. వైసీపీ కేసులు.. అరెస్ట్ లతో చెదిరిపోయిన టీడీపీ నేతలు ఇంకో వైపు టీడీపీ భవిష్యత్ రాజకీయాలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే బాగా ఆలోచించిన టీడీపీ అధినేత.. ఆయన అనుకూల మీడియా పెద్దలు ఇక అదే ఆయుధంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

ఎన్టీఆర్ మామకు మంత్రి పదవీ దక్కేనా?

జగన్ ధాటికి తెలుగుదేశం పార్టీ తన సమస్యలన్నింటికి ఒకే ఔషధం మందులా పనిచేస్తుందని భావిస్తోంది. బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఒకే ఒక్క ఆయుధంగా ఆలోచిస్తోంది. వైసీపీని ఎదుర్కోవడానికి దానికి మించిన ఆయుధం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఫిక్స్ అయ్యారట..

చంద్రబాబు మరోసారి బీసీ బాధితుల కార్డ్ ను తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. పార్టీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు… వైసీపీ ప్రారంభించిన ప్రతీ దాడికి టీడీపీ ఇప్పటివరకు ఈ కార్డును మాత్రమే ఉపయోగిస్తోంది.

ఈఎస్ఐ కుంభకోణంలో సీనియర్ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ బీసీకార్డునే తెరపైకి తెచ్చింది. కానీ ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రమేయం లేదని చంద్రబాబు, టీడీపీ ఒక్కసారి కూడా ఖండించలేదు.

అదే విధంగా ఓ హత్యకేసుకు సంబంధించి మచిలీపట్నం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు అదే బీసీ కార్డును ప్రవేశపెట్టారు.

ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ.. అతడి కుమారుడు ఆర్థిక దుశ్చర్యలకు అరెస్ట్ కాబోతున్నారు. ఈ సారి చంద్రబాబు మరోసారి బీసీ కార్డును ఉపయోగించబోతున్నారట..

ఈ మేరకు రెడ్డిలతో బలంగా ఉన్న వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆదినుంచి టీడీపీకి అనుకూలంగా.. ఆలవాలంగా ఉన్న బీసీలనే ప్రయోగించబోతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.