Surekhavani: సురేఖావాణికి తోడు కావాలంట. ముసలోళ్ళకు కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు మాత్రం ఏ యోగం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తుంది. సురేఖావాణి లేటెస్ట్ వీడియో సంచలనం రేపుతోంది. సురేఖావాణి భర్త సురేష్ తేజ 2019లో కన్నుమూశారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో పడ్డారట. భర్త మరణంతో సురేఖావాణి ఒంటరి అయ్యారు. కూతురితో పాటు సురేఖావాణి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది.
ఆ మధ్య సురేఖావాణి రెండో పెళ్లిపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను సురేఖావాణి కూతురు సుప్రీత ఖంచింది. నిరాధార కథనాలు రాయకండి అంటూ మీడియా మీద మండిపడింది. అప్పుడప్పుడు సురేఖావాణి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లి సంగతి ఏమో కానీ… బాగా డబ్బున్న అందగాడు దొరికితే చక్కగా సిటిలై పోతానని ఆమె కామెంట్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంస్టాగ్రామ్ రీల్ చేశారు. ముసలోళ్ళకు కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు కావడం లేదని ఆ వీడియోలో ఆవేదన చెందింది.
ఇది ఫన్ కోసం చేసిన వీడియో అయినప్పటికీ సురేఖావాణి తోడు లేక అల్లాడిపోతుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నటుడు నరేష్ మీద ఆమె సెటైర్ వేశారని కొందరు అంచనా వేస్తున్నారు. నరేష్-పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో వారి బంధం మీద సురేఖావాణి పరోక్ష కామెంట్స్ చేశారంటున్నారు. ఆమె ఉద్దేశం ఏదైనా కానీ… సురేఖావాణి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ మధ్య సురేఖావాణికి ఆఫర్స్ తగ్గాయి. నన్ను పరిశ్రమ పక్కన పెట్టిందని సురేఖావాణి అసహనం బయటపెట్టారు. ఏంటి నటించడం లేదని అందరూ అడుగుతున్నారు. అవకాశాలు ఇస్తే ఎందుకు నటించను. ఆఫర్స్ ఇవ్వడమే కరువైపోయిందని ఆమె అన్నారు. మరోవైపు కూతురిని హీరోయిన్ చేసే ప్రణాళికలో ఉన్నారు. సుప్రీత ఆల్రెడీ సెలెబ్రిటీ హోదా అనుభవిస్తుంది. కూతురు హీరోయిన్ గా సక్సెస్ అయితే చూడాలని సురేఖావాణి కోరుకుంటుంది. మరి ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. సురేఖావాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తున్నారు.