Homeక్రీడలుIPL 2023 Final GT Vs CSK: టీంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ చెన్నై...

IPL 2023 Final GT Vs CSK: టీంలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ట్రోఫీ ఎలా గెలిచింది?

IPL 2023 Final GT Vs CSK: చెన్నై సూపర్ కింగ్స్..ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానులు పులకరించి పోతారు, IPL చరిత్ర లో ఈ టీం ని ఒక తిరుగులేని శక్తిగా మలిచింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీనే.ఆయన లేకపోతే ఈ టీం నేడు ఈ స్థాయిలో ఉండేది కాదు అని చెప్పొచ్చు. నాయకత్వ లక్షణాలు సరిగ్గా లేకపోతే ఎంత మంచి ఆటగాళ్లు ఉన్నా ట్రోఫీ గెలవలేరు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు IPL లో ఉన్నాయి.ఇక మహేంద్ర సింగ్ ధోని చెప్పే సూచనలు తూచా తప్పకుండ అనుసరించిన టీం మేట్స్ గొప్పతనం కూడా చాలా ఉంది.

ముఖ్యంగా రహానే గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సీజన్ లో చివరి దాకా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఫామ్ ని కనబర్చడానికి ప్రధాన కారణాలలో ఒకడిగా నిలిచారు.ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు రహానే ఏమాత్రం డిమాండ్ లేని ఆటగాడు. ఎందుకంటే అతని ఫామ్ మొత్తం పోయింది.

ఇండియన్ క్రికెట్ టీం లో కూడా అతనికి చోటు దక్కలేదు అప్పట్లో. అలాంటి ప్లేయర్ యాక్షన్ లోకి వస్తే ఒక్క టీం కూడా అతనిని పట్టించుకోలేదు, చివరికి అన్ సోల్డ్ గా మిగిలిపోయిన రహానే ని చెన్నై సూపర్ కింగ్స్ టీం కొనుగోలు చేసింది. తనకి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకున్న రహానే,మొదటి మ్యాచ్ నుండి అద్భుతమైన బ్యాట్టింగ్ స్కిల్స్ చెన్నై సూపర్ కింగ్స్ టీం ని విజయ తీరాలకు చేర్చాడు. అందుకు ధోని ప్రోత్సాహం కూడా కీలకం. ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఎలాంటి కంప్లైంట్ లేదు, కానీ బ్యాటింగ్ ఆర్డర్ కి తగ్గట్టుగా , బౌలింగ్ ఆర్డర్ లేదు, ఇలాంటి టీం ని ధోని ఎలా ఫైనల్స్ వరకు నెట్టుకొస్తాడనే సందేహం అభిమానుల్లో ఉండేది.

కానీ మాస్టర్ మైండ్ ధోని తన బౌలింగ్ ఆర్డర్ మెరుగు పడేవరకు టాస్ గెలిచినప్పుడల్లా ఫీల్డింగ్ ని ఎంచుకునే వాడు.ఎందుకంటే ఎంత టార్గెట్ ఇచ్చినా మన ఆటగాళ్లు ఛేదించగలరు అనే నమ్మకం ఆయనలో ఉంది కాబట్టి. ఆ తర్వాత పతిరానా వంటి బౌలర్లు ని గుర్తించి, అతినిలో ఉన్న లోపాలను సరిచేసే విధంగా ధోని మెంటర్ షిప్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అని చెప్పాలి. అలా తన సైన్యం లో ఉన్న లోపాలను ఎత్తులు పైఎత్తులతో అధిగమించి , తిరుగులేని శక్తి గా తన టీం ని మార్చి ఐదవ సారి ట్రోఫీ ని టీం కి అందేలా చేసాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular