https://oktelugu.com/

Supritha: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ తో సురేఖావాణి కూతురు రొమాన్స్… భలే ట్విస్ట్ ఇచ్చారే!

Supritha చాలా కాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది. గతంలో మాదిరి సురేఖావాణికి ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా జనాలకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కాగా సురేఖావాణితో పాటు కూతురు కూడా ఈ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 1, 2024 / 12:18 PM IST

    Supritha

    Follow us on

    Supritha: ఎట్టకేలకు సురేఖా వాణి సుప్రీత హీరోయిన్ గా అరంగేట్రం ఇస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నేడు సుప్రీత డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేశారు. నటి సురేఖా వాణి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాలుగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేశారు. 2019లో సురేఖావాణి భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆ బాధలో కొన్నాళ్ళు సినిమాల నుండి గ్యాప్ తీసుకుంది. అదే సమయంలో కోవిడ్ వ్యాప్తి కాగా లాక్ డౌన్ విధించారు.

    అలా ఆమె చాలా కాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది. గతంలో మాదిరి సురేఖావాణికి ఆఫర్స్ రావడం లేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా జనాలకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కాగా సురేఖావాణితో పాటు కూతురు కూడా ఈ వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ఆ విధంగా సుప్రీత పాపులారిటీ తెచ్చింది.

    ఇక సుప్రీతను ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలో అవుతున్నారు. తరచుగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. కూతురిని హీరోయిన్ చేయాలని సుప్రీత ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. సురేఖావాణి ప్రయత్నాలు ఫలించాయి. సుప్రీత హీరోయిన్ గా ఓ చిత్రానికి ఎంపికైంది. ఈ చిత్ర హీరో ఎవరంటే… బిగ్ ఓస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్. నేడు ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రసాద్ ల్యాబ్స్ లో లాంఛ్ చేశారు.

    ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకుడు కాగా మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, వినోద్ కుమార్ వంటి సీనియర్ నటులు కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక అమర్ దీప్ సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ మధ్య వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నాడు. బిగ్ బాస్ 7లో పాల్గొన్న అమర్ దీప్ ఒకింత పరువు పోగొట్టుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్లో టార్గెట్ చేయడంతో బయట ఫ్యాన్స్ దాడి చేశారు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.