https://oktelugu.com/

Surekha Vani: యంగ్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సురేఖ వాణి.. నిజమెంత ?

తన కొడుకు వయసున్న ఒక యంగ్ హీరో గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 18, 2023 / 11:54 AM IST

    Surekha Vani

    Follow us on

    Surekha Vani: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఎప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే మన తెలుగులో చాలా మంది ఉన్నారు. వాళ్లలో గుర్తుంచుకోదగిన నటి సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా , పిన్నిగా , అమ్మ గా నటించి మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే సురేఖ వాణి గురించి టాలీవుడ్ క్లోజ్ సర్కిల్స్ లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేమంటే ఒక యంగ్ హీరో తో ఆమె రొమాన్స్ చేస్తుందని టాక్

    తన కొడుకు వయసున్న ఒక యంగ్ హీరో గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సురేఖ వాణి తో పరిచయం అయ్యి, ఆమెకు బాగా క్లోజ్ అయ్యాడని తెలుస్తోంది. ఈ జంట పార్టీలు, పబ్ లు అంటూ బాగానే తిరుగుతున్నారని తెలుస్తోంది. కేవలం బయటే కాకుండా అప్పుడప్పుడు సురేఖవాణి ఇంటికి కూడా వచ్చి వెళ్తున్నట్లు సమాచారం.

    నిజానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి కి అవకాశాలు ఇప్పుడు తక్కువ గానే వస్తున్నాయి. అయిన కానీ ఏదో ఒక విధంగా ఆమె మీడియా లో కనిపిస్తూనే ఉంది. తన కూతురుతో కలిసి చిట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో గట్టిగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రేమాయణం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సురేష్ తేజ్ అనే టెలివిజన్ షో ల డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది సురేఖావాణి.

    అతను రైటర్ గా డైరెక్టర్ గా అనేక టీవీ షో లు చేశాడు. మా టాకీస్, హార్డ్ బిట్ , మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి షోలు చేశారు. ఆయన దర్శకత్వంలోనే మొగుడ్స్ పెళ్లామ్స్ , హార్డ్ బీట్ షోస్ లో సురేఖ వాణి హోస్ట్ గా చేసింది.. వీరికి ఒక అమ్మాయి ఉంది. 2019 లో అనారోగ్యం రీత్యా సురేష్ తేజ్ చనిపోయాడు. దానికి ముందు నుంచే అతనికి దూరంగా ఉంటుంది సురేఖవాణి. ఇక అతను చనిపోయిన తర్వాత ఆమెలో చాలా సృష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి