https://oktelugu.com/

Payal Ghosh: హోటల్ లో ఎదను చూపిస్తూ రచ్చ చేస్తున్న జూ.ఎన్టీఆర్ హీరోయిన్..

పాయల్ బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక్కడ సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించింది. అయితే ఆ మధ్య డైరెక్టర్ అనురాగ్ కశ్యఫ్ పై సంచలన ఆరోపణలు చేసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 18, 2023 / 11:49 AM IST

    Payal Ghosh

    Follow us on

    Payal Ghosh: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు ఎవరైనా స్టార్ కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్న రేంజ్ లో రాణించలేకపోతారు. అయితే ఎలాగోలా అవకాశాలు తెచ్చుకుని సినిమాల్లో నటించినా.. ఆ తరువాత వారికి వివాదాలు చుట్టుముట్టి కష్టకాలంలోని నెట్టెస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మెరిసిన ఓ హీరోయిన్ ఆ తరువాత ఓ స్టార్ డైరెక్టర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ చాలా రోజుల తరువాత ఓ హోటల్ లో కూర్చొని ఎద అందాలను ఆరబోసింది. ఈ అందాలను చూసి షాకైన నెటిజన్లు ఏమైంది ఈమెకు? అని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకా ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి.

    జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ‘ఊసరవెళ్లి’ గుర్తుందా? ఇందులో తమన్నా పక్కన మరో హీరోయిన్ కనిపిస్తుంది. తమన్నాకే స్నేహితురాలిగా నటించిన ఈమె హీరోయిన్ తో సమానంగా తన పాత్రలో నటించింది. ఈమె పేరు పాయల్ హోష్. పాయల్ పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాలో 1992 లో జన్మించింది. పొలిటికల్ సైన్స్ లో పట్టా పొందిన ఆమె ఆ తరువాత జీవితం కోసం ముంబైకి మకాం మార్చింది.

    అయితే అంతకుముందే 17 సంవత్సరాల వయసులోనే బీబీసీ వారు నిర్మించిన ‘షార్పేస్ పెరిల్’ టెలీ ఫిల్మ్ లో నటించింది. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది. అయితే చదువు పూర్తయిన తరువాత సినిమాల్లోకి వెళ్లాలని తల్లిదండ్రులకు చెబితే అడ్డుకున్నారు. దీంతో వారిని వ్యతిరేకించి మరీ ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె తెలుగు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి పరిచయం అయింది. ఆయన తీసిన ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ కొట్టినా పాయల్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’లో సైడ్ హీరోయిన్ గా చేసింది.

    పాయల్ బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక్కడ సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించింది. అయితే ఆ మధ్య డైరెక్టర్ అనురాగ్ కశ్యఫ్ పై సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లో చాన్స్ రావాలంటే డైరెక్టర్ తో కమిట్ కావాలని, అలా ఎంతో మంది తనను కమిట్ కోసం అడిగారని చెప్పింది. అయితే ఆమె ఇలా ఆరోపణలు చేయడంతో సినిమాల్లో అవకాశాలు తగ్గాయని కొందరు అంటున్నారు. అందుకే సినీ ఫీల్డులోకి వచ్చిన ఏల్లు గడుస్తున్నా.. 11 సినిమాలు మాత్రమే చేసింది.

    తాజాగా ఈ అమ్మడు చాలా రోజుల తరువాత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ గా కనిపించింది. ఓ హోటల్ లో కూర్చున్న పాయల్ తయ అందాలను ఆరబోసింది. ఈ ఫొటోలో పాయల్ ను చూసి కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు. ఇంత అందమైన పాయల్ కు అవకాశాలు ఎందుకు ఇస్తలేరు? అని చమత్కారంగా కామెంట్లు పెడతున్నారు. అయితే పాయల్ ఇలా ఫోజులు ఎందుకు పెట్టిందో తెలియదు గానీ.. ఈమె ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.