https://oktelugu.com/

Flood relief to AP: తప్పెవరిది? వరదసాయం కేంద్రం ముందే ఇచ్చిందట..! జగన్ సర్కార్ ఈ నిధులు ఏం చేసింది..?

Flood relief to AP: ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ కన్నీరు మున్నీరవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇక్కడి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. ఇళ్లు, పంటలు ఎక్కడికక్కడా కోట్టుకుపోవడంతో కట్టుబట్టలతోనే మిగిలారు. ఎవరైనా సాయం చేస్తే తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈ సమయంలో ప్రభుత్వం నిరాశ్రయులను గుర్తించి  వారికి సహాయ సహకారాలను అందిస్తోంది. అంతేకాకుండా నష్టపరిహారాన్ని కూడా పంపిణీ చేస్తోంది. అయితే ఇంత పెద్ద విపత్తు సంభవించినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 / 10:29 AM IST
    Follow us on

    Flood relief to AP: ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమ కన్నీరు మున్నీరవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇక్కడి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేదు. ఇళ్లు, పంటలు ఎక్కడికక్కడా కోట్టుకుపోవడంతో కట్టుబట్టలతోనే మిగిలారు. ఎవరైనా సాయం చేస్తే తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈ సమయంలో ప్రభుత్వం నిరాశ్రయులను గుర్తించి  వారికి సహాయ సహకారాలను అందిస్తోంది. అంతేకాకుండా నష్టపరిహారాన్ని కూడా పంపిణీ చేస్తోంది. అయితే ఇంత పెద్ద విపత్తు సంభవించినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదా..? అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇందులో భాగంగా ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ సమావేశంలో వరద సాయంపై అడిగారు. అటు రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా వరద బాధితులను ఆదుకోవాలన్నారు. ఈ విషయంపై కేంద్రం వెంటనే స్పందించింది. మీకు అందాల్సిన సాయం ఎప్పుడో అందిందని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి, రాయలసీమ వరద బాధితులకు షాక్ తగిలింది. ఇంతకీ ఆ డబ్బులు ఏమయ్యాయి? ఎటు పోయాయన్నది ఇక్కడ ప్రశ్నగా మారింది.

    Flood relief to AP

    దాదాపు 50 ఏళ్ల తరువాత ఏపీలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడూ జరగలేదు. ఏపీలో తుఫాన్లు సంభవించినా కరువు ప్రాంతం రాయలసీమలో మాత్రం ప్రభావం చూపేది కాదు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రాజెక్టులు తెగిపోయేంతలా వరదలు రావడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఊహించని ఈ మహావిపత్తులో కూరుకుపోయారు. ఇంతటి వరదలు సంభవిస్తాయని ఊహించలేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో చాలా మంది ప్రజలు ప్రభుత్వ సాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా కేంద్రం సపోర్టు కావాలని కోరింది.

    భారీ వర్షాలతో రాయలసీమలో జరిగిన నష్టానికి కేంద్రం సాయ కావాలని జగన్ లేఖ రాశారు. మరోవైపు ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో వరద సాయంపై కోరడంతో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రకృతి విఫత్తుల కింద ఏపీ రాష్ట్రానికి ఇప్పటికే 895 కోట్ల నిధులను అందించామని తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణ సాయం కింద బాధితులకు అందించేందుకు ఎస్డీఆర్ఎప్ నిధులను కేంద్ర 1,192 కోట్లను కేటాయించింది. వీటిని బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఉపయోగించాలని తెలిపింది. అయితే ఇందులో 895 కోట్లు కేంద్రం వాటా కాగా.. 297 కోట్లు రాష్ట్రం వాటాగా కేటాయించింది.

    అయితే కేంద్రం వాటా కింద 895 కోట్ల రూపాయలను ముందుగానే ఇచ్చేశామని కేంద్రమంతి తెలిపారు. అయితే ఈ నిధులను తక్షణ సాయం కిందే ఉపయోగించాలని, పరిహారం కింద చెల్లించవద్దని తెలిపింది. దీంతో ఇప్పుడు జరిగిన వరదల కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదని పరోక్షంగా చెప్పినట్లయింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో భాగంగానే ఈ నిధులను తెచ్చి వేరే వాటికి ఖర్చే చేశారా..? అన్న అనుమానాలు మొదలవుతున్నాయి.

    Also Read: పొగడ్తల ‘వరద’.. సాయం అందేనా మరీ?

    వరదసాయంపై ఇప్పటికే ప్రభుత్వం లేట్ గా స్పందించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొంత ప్రాణ నష్టం తక్కువయ్యేదని అంటున్నారు. కానీ జగన్ వరద బాధితులను పట్టించుకోలేదని అంటున్నారు. మరోవైపు కొందరు వైసీపీ నేతలు సాయం పేరుతో ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదని అంటున్నారు.

    ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్రం నుంచి రకరకాల అవసరాలకు తెచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు చెల్లించడంతో ఇప్పుడు నిధుల కొరత తీవ్రంగా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం బాధితులకు ఎలంటి సాయం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో సీఎం నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ నష్టం అంచనా వేసి న్యాయం చేస్తున్నారు. కానీ ఏపీ సీఎం హెలిక్యాప్టర్లో చక్కర్లు కొట్టి వెళ్లారని విపక్షాలు, బాధిుతుల ఆరోపిస్తున్నారు. బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని అంటున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.

    Also Read: ఏపీ మునుగుతోంది.. మళ్లీ భయానక వాతావరణం