Sunil
Sunil: టాలీవుడ్ మూవీస్ లో కథ ,హీరో ఎంత ఇంపార్టెంట్ కమెడియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కమెడియన్స్ ఎందరున్నప్పటికీ తమ కామిడీ టైమింగ్ తో అద్భుతంగా నవ్వుల పువ్వులు పూయించే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రెసెంట్ అలాంటి కమీడియన్స్ లో సునీల్ ఒకరు. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన సునీల్ ఆ తరువాత హీరోగా కూడా నటించారు.
సాధారణమైన మ్యానరిజమ్స్, కరెక్ట్ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే సునీల్.. మూవీస్ లో కొన్ని సీన్స్ అలాగే గుర్తుండిపోతాయి. మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలి అని భీమవరం నుంచి హైదరాబాద్ చేరిన సునీల్ చాలా తక్కువ సమయంలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కామెడీతో నవ్వించడమే కాదు మంచి యాక్షన్స్ సన్నివేశాలలో కూడా నటించగలను అని నిరూపించుకున్నాడు.
అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న.. లాంటి కామెడీ మూవీస్ లోనే కాకుండా నాగచైతన్య అన్నగా సెకండ్ మెయిన్ లీడ్ లో పోలీస్ క్యారెక్టర్ లో సునీల్ నటించిన తడాఖా మూవీలో సునీల్ ఎక్స్లెంట్ గా నటించాడు. అయితే పుష్ప మూవీ తర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా విలన్ గా కూడా సౌత్ ఇండియన్ మూవీస్ లో సునీల్ బాగా బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోస్ ఎందరో కనిపించారు.. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆ లక్కీ ఛాన్స్ సునీల్ కే దక్కింది.
అయితే ఇప్పుడు సునీల్ అందుకున్న సక్సెస్ అతనికి ఊహించినంత సులభంగా రాలేదు. కెరియర్ మొదటి దశలో అతను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడమే కాకుండా అవమానాలను కూడా భరించాల్సి వచ్చింది. అప్పట్లో సునీల్ తో ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ చనువుగా ఉండేదట. సునీల్ కూడా ఆమెతో కాస్త చనువుగా మాట్లాడేవాడట. అయితే సునీల్ ఒక సందర్భంలో వేసిన పంచ్ డైలాగ్ కు బాగా హర్ట్ అయిన స్టార్ హీరోయిన్ ముందు వెనక ఆలోచించకుండా సునీల్ చెంప పగలగొట్టింది. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సౌత్ ఇండియాలో సూపర్ బిజీ స్టార్ త్రిష.
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Read MoreWeb Title: Sunil revealed interesting facts about his film career
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com