Sunil: ఇండియన్ బాక్సాఫీసును షేక్ ఆడించిన మూవీ ‘‘పుష్ప 2’’. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించినా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించ లేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త కుదురుకోవడంతో యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్, సుకుమార్‌లు మాట్లాడిన మాటలు పలు ఆసక్తికర విషయాలకు స్పష్టతనిచ్చాయి. ముఖ్యంగా, ఈ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డు ఉండదని, ఇంకా అనేక సినిమాలు రావొచ్చని సుకుమార్ స్వయంగా వెల్లడించడం అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే “పుష్ప 3” కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. మరో సీక్వెల్ రానుండడంతో సుకుమార్ ప్రకటన అభిమానులకు సంతోషాన్ని అందించింది.
ఈ థ్యాంక్స్ మీట్‌లో నటుడు సునీల్ స్పీచ్ మొత్తం ఎమోషనల్‌గా సాగింది. “పుష్ప”లో మంగళం శీను అనే ఏజ్డ్ స్మగ్లర్ పాత్రలో నటించిన ఆయన, ఆ పాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు. తనను స్పెయిన్‌లో ఉన్న “పాకిస్తానీ కబాబ్ సెంటర్” వారు కూడా గుర్తించడం విశేషమని పేర్కొన్నారు. స్పెయిన్‌లో షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను సునీల్ వివరించారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఆకలితో ఫుడ్ కోసం వెతికిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. స్పెయిన్‌లో రాత్రి 10.30కే దుకాణాలు మూసివేస్తారని, చివరికి ఒక కబాబ్ పాయింట్ చూసి అక్కడ నిలిచామని తెలిపారు. అక్కడ ఉన్నవారు “పుష్ప” సినిమాను గుర్తించి, ప్రత్యేకంగా వంటలు చేసి పెట్టారని, వారంతా పాకిస్తానీలని తర్వాతే తెలుసుకున్నానని పేర్కొన్నారు. హిందీ రాకపోయినా, ఉర్దూలో వారి వద్ద తన అనుభవాలను పంచుకున్నానని సునీల్ అన్నారు.
తన నటనా జీవితానికి మళ్లీ కొత్త అర్థం ఇచ్చిన “పుష్ప” గురించి మాట్లాడిన సునీల్.. “ఒక నటుడు బతికుండగానే పునర్జన్మ పొందడం చాలా అరుదు. కమెడియన్‌గా ఉన్న నాకు విలన్‌గా అవకాశం ఇచ్చిన సుకుమార్ నిజంగా సాహసం చేశాడు” అని అన్నారు. తన వయసుకు పెద్ద వాడిగా కనిపించే మంగళం శీను పాత్రలో నటించడం తనకు సవాలుగా అనిపించిందని తెలిపారు. ఇప్పుడు తమిళ్, మలయాళం, కన్నడ పరిశ్రమల నుంచి నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన నా పునర్జన్మ జెండాను ఇప్పుడు అందరూ మోస్తున్నారని భావోద్వేగంతో చెప్పిన సునీల్, తనపై నమ్మకముంచిన సుకుమార్, బన్నీ, పుష్ప టీమ్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.
#Sunil talks about the #Pushpa craze among the people from Pakistan in Spain.#AlluArjun #Pushpa2TheRule #Pushpa2 #Tupaki pic.twitter.com/rz4qHO7c3K
— Tupaki (@tupaki_official) February 9, 2025