Manipur : కొంతకాలంగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో దారుణమైన అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి.. అక్కడ ఉన్న రెండు తెగలు ఒకరిపై ఒకరు దాడు లు చేసుకుంటున్నారు. పరస్పరం దాడి చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ అల్లర్లు అంతకంతకు పెరగడంతో అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఈ అలర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీవ్రంగా ఇరకాటంలో పెట్టాయి. ఈ విషయంపై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్టు పట్టింది. పార్లమెంట్, రాజ్యసభను స్తంభింపజేసింది. రోజుల తరబడి ఈ విషయంపై పార్లమెంటులో రచ్చ జరగడంతో భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ అల్లర్లను తగ్గించడానికి భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఇంటర్నెట్ సేవలను కూడా స్తంభింపజేసింది. గత ఏడాది మణిపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న అల్లర్లలో దారుణం జరిగింది. ఓ వివాహితను వివస్త్రను చేసి ఊరేగించిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ ఘటనను ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగా ఖండించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించాయి. అయితే ఈ ప్రభావం 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. బిజెపి తక్కువ సీట్లు గెలుచుకోవడానికి ఈ ఘటన కూడా ఒక కారణమైంది. అయితే మణిపూర్ మరకను తుడిచి వేయడానికి బిజెపి అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే మణిపూర్ ప్రాంతంలో ఇప్పటికీ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో.. బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇదే అదునుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఎత్తు వేసింది. మరి ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తామని శనివారం వెల్లడించింది.
ఆదివారం నాటకీయ పరిణామాలు
అవిశ్వాసం ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో.. ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు.. మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు పంపించారు. కాగా, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఒక్కరోజులోనే బిజెపి ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం కలిగించింది. అయితే బీరెన్ సింగ్ రాజీనామా చేసినంతమాత్రాన మణిపూర్ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోమని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉందని.. అప్పటిదాకా ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు..” సోమవారం మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించిన తర్వాత.. మణిపూర్ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఇది నైతికంగా మేము సాధించిన విజయం. కాకపోతే ఇందులో రాజకీయాలు చూసుకోవడం లేదు. మణిపూర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాం. బిజెపి అధినాయకత్వం ఆదేశాగా అడుగులు వేయకపోతే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. కచ్చితంగా ఉద్యమాలు చేస్తామని” కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Manipur chief minister biren singh resigns
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com