https://oktelugu.com/

Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Suma: బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. “అందరికీ మామ చందమామ అందరికీ అక్క మన సుమక్క” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వినిపించగా సుమ నిద్రలో కూడా లేచిపడేంత అక్కలు వేశారు మీరు అని కామెంట్లు చేశారు. […]

Written By: , Updated On : April 26, 2022 / 12:41 PM IST
Follow us on

Suma: బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. “అందరికీ మామ చందమామ అందరికీ అక్క మన సుమక్క” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వినిపించగా సుమ నిద్రలో కూడా లేచిపడేంత అక్కలు వేశారు మీరు అని కామెంట్లు చేశారు.

Suma

Suma

డీప్ స్లీప్ లో ఈ వాయిస్ ఓవర్ ను వేస్తే ఉలిక్కిపడతానని సుమ కనకాల వెల్లడించారు. మీరు ఇన్నిసార్లు అక్క అక్క అని పిలిస్తే రాజీవ్ కూడా అక్క అని పిలుస్తాడని సుమ కామెంట్లు చేశారు. నేను ఔట్ స్టాండింగ్ యాంకర్ నని నాకు ఇలా కూర్చోవడం అస్సలు అలవాటు లేదని సుమ చెప్పుకొచ్చారు. ఎంతసేపూ నిలబడి ఏదో ఒకటి మాట్లాడాలని తనకు ఉంటుందని సుమ కామెంట్లు చేయడం గమనార్హం.

Also Read: Mahesh Babu Rajamouli Went Dubai: దుబాయి కి మహేష్ బాబు తో వెళ్లిన రాజమౌళి.. అభిమానులకు పూనకాలు రప్పించే వార్త

అనుష్క, రష్మిక, సమంత, సుమకనకాల అంటూ సుమ సరదాగా కామెంట్లు చేశారు. నాకు ఆరుగురు అత్తలు, 13 మంది బావలు అని సుమ చెప్పారు. నాన్న బ్రదర్స్ సిస్టర్స్ మొత్తం 10 మంది అని సుమ వెల్లడించారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పుడు సుమ హీరోయిన్ అని అలీ చెప్పగా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే 30 ఏళ్లు అని హీరోయిన్ అంటే 16 ఏళ్లు అని సుమ కనకాల కామెంట్లు చేశారు. రాజీవ్ కు, తనకు మధ్య గొడవలు జరగడం వాస్తవమేనని సుమ అన్నారు.

ఈ 23 సంవత్సరాలలో ఎన్నోసార్లు గొడవ పడ్డామని సుమ కనకాల వెల్లడించారు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లీదండ్రులు విడాకులు తీసుకోవడం కష్టం అని సుమ కనకాల వెల్లడించారు. తనకు వయస్సు పెరిగేదేలే అంటూ సుమ షోలో సందడి చేశారు.

Also Read: TS Police Jobs: తెలంగాణ ఎట్టకేలకు కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల

Recommended Videos:

Actress Samantha Spotted at Mumbai Airport || Samantha Latest Video || Oktelugu Entertainment

Ram Charan Confirms Multi Starrer Movie With Pawan Kalyan || Tollywood || Oktelugu Entertainment

Mega Star Chiranjeevi About Ram Charan Acting Skills || Acharya Movie || Oktelugu Entertainment