https://oktelugu.com/

Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !

Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, ఇంకా చెప్పాలంటే ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’.. ప్రస్తుతం ‘అకీరా నందన్’ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఈ నెల 8న అకీరా నందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రక్తదానం చేశాడు. ఉడుకు రక్తం ఉరకలు వేసే వయసులో అసలు అకీరాకి ఇంత పెద్దరికం ఎలా వచ్చింది ? అది పవన్ బ్లడ్ లోని నైజం అంటున్నారు పవన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2022 / 12:51 PM IST
    Follow us on

    Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, ఇంకా చెప్పాలంటే ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’.. ప్రస్తుతం ‘అకీరా నందన్’ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఇలాగే ఫీల్ అవుతున్నారు. ఈ నెల 8న అకీరా నందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రక్తదానం చేశాడు. ఉడుకు రక్తం ఉరకలు వేసే వయసులో అసలు అకీరాకి ఇంత పెద్దరికం ఎలా వచ్చింది ? అది పవన్ బ్లడ్ లోని నైజం అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

    PAWAN, Akira Nandan

    కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం అనవసరం అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టే.. అకీరా, యవ్వనంలోనూ బాధ్యతతో ఆలోచిస్తున్నాడు. ఒకరు నచ్చలేదు అని చెప్పడానికి వెయ్యి కారణాలు చెప్పొచ్చు. కానీ అకీరా ఎందుకు నచ్చారని చెప్పడానికి కారణాలు అనవసరం అంటున్నారు పవన్ ఫాలోవర్స్. పైగా అకీరా పై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

    Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

    ఏ స్టార్ హీరో వారసుడి పాపులారిటీ అయినా, పాసింగ్ క్లౌడ్ లాంటిది అట. అది వాతావరణం వేడిక్కితే వానై కరిగిపోతుంది. కానీ, పవన్ వారసుడు అకీరా ఆకాశం లాంటోడు. ఉరుమొచ్చిన, పిడుగొచ్చినా & మెరుపొచ్చినా.. ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఎప్పుడు పవన్ లా.. అకీరా కూడా ఒంటరిగానే కనిపిస్తాడు. కానీ, భవిష్యత్తు తరాలు మోసే చరిత్రను రాయబోయేది ఒక్కడే! వాడే ‘అకీరా నందన్’ అంటూ పవన్ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని చాటి చెబుతున్నారు.

    ఐతే, పవన్ కి ఓ తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది. కాకపోతే, ‘అకీరా నందన్’కి తిక్క లేదు, కానీ, తండ్రిని మించిన లెక్క ఉంది. అకీరా నందన్ సేవలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కరోనా సమయంలో రేణు దేశాయ్ చేసిన ఎన్నో సేవ కార్యక్రమాలకు కర్త కర్మ క్రియ ‘అకీరా నందనే’. ఈ వయసులో ఇలా చేసే యువకులు ఎంతమంది ?

    ఇంత చిన్న వయసులోనే తన పనులతో అందరి మనస్సుల‌ను అకీరా దోచుకున్నాడు. అందుకే ‘గొప్పవాడి కడుఫున గొప్పవాడే పుడతాడు’ అని పెద్దలు ఎప్పుడో ఓ డైలాగ్ కనిపెట్టారు. ఇది అక్షరాల నిజమే. ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడంలో ‘జెనెటిక్ కోడింగ్’దే ముఖ్య పాత్ర అని ఇప్పటికే రుజువు అయింది. కాబట్టి.. అకీరా వ్యక్తిత్వం పవన్ జెనెటిక్ కోడింగ్ లో నుంచి పుట్టిందే.

    కాబట్టి.. పవన్ అభిమానులురా.. మరో తరానికి కూడా మీ ఊపిరి పీల్చుకోండి, మరో ‘పవన్ కళ్యాణ్’ రాబోతున్నాడు. పేరు ‘అకీరా నందన్‌’ అయినా, తీరులో ‘పవనే’. రూపులో అకీరా నందన్‌ అయినా, ముందుచూపులో పవన్ కళ్యాణే. మరి ‘అకీరా నందన్‌’ సినీ ఎంట్రీ పరిస్థితి ఏమిటి ? కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. అకీరా కటౌట్ చూస్తే బాక్సాఫీస్ కూడా షేక్ అవుతుంది.

    Akira Nandan

    అందుకే, ‘అకీరా నందన్‌’ హీరోగా రావడం లేట్ అవ్వొచ్చు, కానీ.. రావడం మాత్రం పక్కా. అయినా ‘అకీరా నందన్‌’ టైమ్ కి రావడం కాదు ముఖ్యం, ‘అకీరా నందన్‌’ వచ్చాకే టైమ్ రావాలి. అప్పుడు బాక్సాఫీస్ రూల్ మారుతుంది, రూలింగ్ మారుతుంది. కలెక్షన్ల కౌంట్ మారుతుంది, కౌంట్ టేబుల్ మారుతుంది. అసలు అకీరా ట్రెండ్ ఫాలో అవ్వడు. ట్రెండ్ సెట్ చేస్తాడు.

    అకీరా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం.. పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లోకి రావడానికి ఎలా అయితే సన్నద్ధమయ్యాడో అలానే అకీరా కూడా సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే, పవన్ లాగే కత్తిసాము, కర్రసాము నేర్చుకున్నాడు. ప్రస్తుతం కిక్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఇలాగే పరవళ్లు తొక్కుతున్న ఉత్సాహంతో అకీరా, ఇలాగే పవర్ పరిధిని పరిమితిని కూడా మించుపోవాలని కోరుకుందాం.

    Also Read:Perni Nani: మెగాస్టార్ చిరంజీవి దేవుడే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం?

    Recommended Videos:

    Tags