https://oktelugu.com/

Acharya: ఆచార్య సినిమా అనుకున్న సమయానికి వస్తుందా.. ఇప్పటికి ఎంతో బాలన్స్ ఉన్న వర్క్

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి సరిగ్గా మూడు రోజుల సమయం ఉండడంతో ఈ చిత్రం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది మూవీ యూనిట్..చిరంజీవి , రామ్ చరణ్ మరియు కొరటాల శివ లతో పాటుగా ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 12:33 PM IST
    Follow us on

    Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి సరిగ్గా మూడు రోజుల సమయం ఉండడంతో ఈ చిత్రం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది మూవీ యూనిట్..చిరంజీవి , రామ్ చరణ్ మరియు కొరటాల శివ లతో పాటుగా ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా నటించిన పూజ హెగ్డే కూడా ప్రొమోషన్స్ లో గట్టిగా పాల్గొంటుంది..ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అటు ఓవర్సీస్ లోను , ను ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోనూ ప్రారంభం అయ్యిపోయాయి..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఈ మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగ జరుగుతున్నాయి..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతుంది.

    Acharya

    అదేమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ఇంకా టైట్ షెడ్యూల్స్ మధ్య జరుగుతూనే ఉన్నాయి అట..ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ గారు కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ నాణ్యత కోసం లేట్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఇప్పటికే ఓవర్సీస్ కి 5.1 కాపీ ని డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి పంపినట్టు తెలుస్తుంది..గత ఏడాది విడుదల అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి కూడా ఇలాగే చివరి నిమిషం వరుకు పని చెయ్యాల్సిన సందర్భం వచ్చింది..రీ రికార్డింగ్ మరియు కొన్ని షాట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ సరిగా జరగకపోవడం వల్ల మొదటి రోజు ఈ సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చింది..ఇప్పుడు ఆచార్య సినిమాకి కూడా అలాగే జరుగుతుంది ఏమో అని అభిమానులు భయపడిపోతున్నారు..కొరటాల శివ కూడా రీ రికార్డింగ్ వర్క్ ని తొందరగా పూర్తి అయ్యేలాగా మణిశర్మ పై తీవ్రమైన ఒత్తిడి పెట్టాడు అట.

    Also Read: Gemini TV Anchors: నాటి జెమినీ టీవీ యాంకర్స్ గుర్తున్నారా.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

    ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ వారు UA సర్టిఫికెట్ ని అందచేసినట్టు సమాచారం..సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు చాలా కాలం తర్వాత ఒక్క మంచి ఎమోషనల్ మూవీ ని చూసిన అనుభూతి కలిగింది అని మూవీ యూనిట్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు అట..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు చాలా బాగున్నాయి అని..అభిమానులకు కచ్చితంగా ఈ సినిమా ఒక్క కనుల పండుగ లా ఉండబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరుకు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కి కూడా గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయి అట ఈ సినిమాలో..మరి ఇవి అన్ని ఎంత వరుకు నిజమో తెలియాలి అంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.

    Also Read: Perni Nani: మెగాస్టార్ చిరంజీవి దేవుడే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం?

    Recommended Videos:

    Tags