Suma- Rajiv Kanakala: సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫొటోలతో పాటు మ్యారేజ్ కు సంబంధించిన పిక్స్ ను డిజిటల్ మీడిమా ద్వారా బయటపెడుతున్నారు. ఈ తరుణంలో వారి ఫ్యాన్ష్ లైక్స్ కొట్టి ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట అలనాటీ మేటి హీరో నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన శుభలేక కూడా నెట్టింటా హల్ చల్ చేసింది. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్స్ కు సంబంధించి పెండ్లి పత్రిక వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరిదో తెలుసా?
దశాబ్దాల కాలంగా వెండితెర, బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తున్న భామ సుమ. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టీవీ సీరియల్స్ లో నటించిన ఈమె ఆ తరువాత యాంకర్ గా మారారు. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్ గానూ చేశారు. కానీ ఆ సినిమా ఆకట్టుకోలేదు. దీంతో సుమ హీరోయిన్ గా రాణించలేకపోయారు. కానీ కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా నటించారు.అయితే తనకు అచ్చొచ్చిన టీవీ పరిశ్రమనే నమ్ముకున్నారు సుమ. దీంతో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ అయ్యారు.
టీవీ సీరియల్స్ లో నటిస్తున్న కాలంలో సుమ తోటి నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్నారు. 1994లో ‘జీవనరాగం’ అనే సీరియల్ లో నటిస్తున్నప్పుడు సుమ, రాజీవ్ కనకాలలు కలిశారు. ఈ సమయంలో సుమను చూసిన తరువాత రాజీవ్ కనకాల మనసు పారేసుకున్నారు. ఆ తరువాత ఆమె దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేశారు. కానీ మొదట సుమ నో చెప్పింది. అయితే ఓ రోజు షూటింగ్ కు వచ్చిన సందర్భంలో సుమ కారు తీసుకురాలేదు. అయితే తాను రాజీవ్ కనకాల కారులో వెళ్లాలని అనుకుంది. అప్పుడే సుమ, రాజీవ్ ల ప్రేమాయణం మొదలైంది.
మొదట్లో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. కానీ ఎలాగోలా ఒప్పించి 1999 ఫిబ్రవరి 10న ఘనంగా తెలుగు, కేరళ సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ముద్రించిన వీరి పెళ్లి పత్రిక ఇప్పుడు బయపడింది. ఈ వెడ్డింగ్ కార్డు మిగతా వాటికంటే భిన్నంగా ఉంది.అంతేకాకుండా ఇందులో రాజీవ్, సుమలకు సంబంధించిన వివరాలు చూసి ఫ్యాన్ష్ ఆశ్చర్యపోతున్నారు. మరి మీరు కూడా ఆ పిక్ ను చూసేయండి..