Rashmika Mandanna: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటీ… రష్మిక ఆశలన్నీ ఆ చిత్రం మీదే!

హిందీలో నటించిన మొదటి సినిమా 'గుడ్ బై' మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన 'మిషన్ మంజు' ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

Written By: Shiva, Updated On : September 22, 2023 1:13 pm

Rashmika Mandanna

Follow us on

Rashmika Mandanna: పుష్ప సినిమా తో ఒక్కసారి టాప్ లీగ్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది రష్మిక. నేషనల్ క్రాష్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇందులో భాగంగా తెలుగు సినిమాలు పెద్దగా ఒప్పుకోకుండా కేవలం హిందీ మీదే ఫోకస్ పెట్టింది. అయితే అక్కడ ఆమెకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ దక్కించుకోలేదు.

హిందీలో నటించిన మొదటి సినిమా ‘గుడ్ బై’ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘మిషన్ మంజు’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమాలో నటించిన రష్మిక కు కనీసం మార్కులు కూడా పడలేదు. దీనితో ఇప్పుడు ఈ అమ్మడు యానిమల్ అనే సినిమా మీదే ఆశలు పెట్టుకొని ఉంది. డిసెంబర్ 1 న విడుదల కాబోతున్న ఈ సినిమా తో అయిన తొలి విజయాన్ని సాధించాలని అనుకుంటుంది.

రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ , బాబీ డియోల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సెప్టెంబర్ 28 న యానిమల్ టీజర్ విడుదల కాబోతుంది. తెలుగులో అర్జున్ రెడ్డి తెరకెక్కించిన సందీప్ వంగ ఈ సినిమాకు దర్శకుడు. దీనితో ఆ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా ఫలితం మీదే రష్మిక బాలీవుడ్ కెరీర్ అనేది ఆధారపడి ఉంది. యానిమల్ విజయం సాధిస్తే అక్కడ అవకాశాలు బాగానే వస్తాయి, ఏమైనా తేడా కొడితే మాత్రం రష్మికకు మళ్ళీ టాలీవుడ్ దిక్కు అవుతుంది. ప్రస్తుతం కేవలం పుష్ప 2 సినిమా లో మాత్రమే నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక కోలీవుడ్ లో కూడా ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు అయితే రావడం లేదు. మరోపక్క విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమాలో రష్మిక ను ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. .