Sukumar : ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని… దానికి తగ్గ కథని రాసుకొని అందుకు తగ్గ నటీనటులను ఎంచుకొని దానిని సక్సెస్ ఫుల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగాలి అంటే దానికి చాలా గట్స్ ఉండాలి. అలాంటి దర్శకులు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లు మాత్రమే సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటు ముందుకు సాగుతూ ఉంటారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఆర్య’ (Aarya) మూవీతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకు అరుదైన గౌరవం అయితే దక్కింది. ఇక దాన్ని ముందుకు తీసుకెళ్తూ పాన్ ఇండియాలో సైతం ఆయన నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తన శిష్యులు సైతం దర్శకులుగా మారి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సుకుమార్ లాంటి దర్శకుడు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్(Ram Charan) తో చేయబోతున్న సినిమా తో మరోసారి ఇండియాను షేక్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ కోసం రాసుకున్న కథలోకి వచ్చిన స్టార్ హీరో…
మరి సుకుమార్ రైటింగ్ అంటే ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఇక ముఖ్యంగా ఆయన రైటింగ్ టీమ్ లో కొంతమంది ప్రత్యేకంగా రచయితలు అయితే ఉంటారు. ఇక వాళ్లకోసం ఆయన భారీగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటాడు అంటూ మరి కొంతమంది సుకుమార్ టీం లో ఉన్న వ్యక్తులు చెబుతూ ఉంటారు.
ఆయనకి సినిమాలు ఉన్నా లేకపోయినా ఆ రైటర్లు ఆయనతోనే ఉంటారు. వాళ్లకు ప్రతినెలా సాలరీలు తనే పే చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి దాదాపు లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక సుకుమార్ ప్రతి సీన్ ని చాలా డీటెయిలింగ్ గా ఆలోచిస్తూ రాస్తూ ఉంటారు. కాబట్టి తన డీటెయిల్ కి వాళ్ళు సహకారాన్ని అందిస్తూ సినిమాని సక్సెస్ ఫుల్ గా మలచడానికి స్క్రిప్ట్ పరంగా వాళ్ళు తమ వంతు సహాయమైతే చేస్తారు.
ఇక డైరెక్షన్ టీం కూడా మేకింగ్ సమయంలో చాలా చురుగ్గా ఉంటూ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ కి ఉన్న గుర్తింపు మరే దర్శకుడికి దక్కడం లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : సుకుమార్ రామ్ చరణ్ తర్వాత ఆ స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నాడా..?