‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై స్వాతీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. మరి కొన్ని రాశుల వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు పెండింగ్ బకాయిలను ఈరోజు పొందుతారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. జీవితంలో అనుకోకుండా సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి బహుమతిని పొందుతారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనేక రంగాల వారు లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయం ఉండడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే వాటికి దూరంగా ఉండాలి. అందరి వ్యక్తులు మీకు సహాయం చేయవచ్చు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరైనా ఇబ్బందులు ఉంటే స్నేహితులు సాయం చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కొన్ని విజయాలు సాధించాలంటే ఇతరుల సహకారం తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులకు కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల్లో శుభకార్యంలో పాల్గొంటారు. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేయకుండా చేపట్టిన పనులను పూర్తి చేయాలి. వ్యాపారులు ఈరోజు లాభాలు పొందే అవకాశం ఉంది. కొన్ని పనులు అసంపూర్ణంగా ఉండడంతో నిరాశలతో ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి కష్టపడతారు. వీరికి తోటి వారి సహాయం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండరుంది. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఈ విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యమైన పనులను మాత్రమే చేయాలి. అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవద్దు. పనికిరాని విషయాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ పై దృష్టి పెట్టాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొందరు మోసం చేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో పేరు తీసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఉద్యోగులు ఉత్సాహం చూపించాలి. లేకుంటే అధికారంలో నుంచి వేధింపులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందడానికి కొత్త మార్గాలు వేసుకుంటారు. కొన్ని పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందాల్సి ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొన్ని విషయాల్లో సహనం పాటించాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి చాలా రంగాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం పై ప్రత్యేకత వహించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనం పాటించాలి.