RRR : సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు… రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో పాన్ వరల్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Raed : మహేష్ పని ఇక అయిపోయినట్టే..రాజమౌళి ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదుగా!
రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసింది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కడమే కాకుండా వరల్డ్ లో ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపు అయితే లభించింది…ఇక ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు రావడం అనేది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన ఒక అరుదైన గౌరవమనే చెప్పాలి… మూడేళ్ల తర్వాత మరోసారి త్రిబుల్ ఆర్ సినిమా సందడి మొదలైందనే చెప్పాలి. లండన్ లోని ప్రతిష్టాత్మకమైన ‘రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు… ఇక ఈ వేడుకలో చాలామంది అతిధులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ సినిమా యూనిట్ అయిన దర్శకుడు రాజమౌళి (Rajamouli), హీరో రామ్ చరణ్(Ram Charan) ఈ వేడుకలో పాల్గొని దానిని సక్సెస్ ఫుల్ ఈవెంట్ గా మార్చారు. ఇక ఈ ఈవెంట్ లో ‘రాయల్ ఫీల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రా’ తో కలిసి కీరవాణి ప్రదర్శనలను ఇస్తూ అతిధులను మంత్రముగ్ధుల్ని చేశాడు…
ఒకే వేదిక మీద దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరోలు కనిపించడంతో అక్కడికి వచ్చిన జనాల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ కూడా తెలియజేశారు… దీంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు…
మూడు సంవత్సరాల క్రితం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పటికి అంతర్జాతీయంగా తన పేరును మారుమ్రోగేలా చేస్తుంది అంటే ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక మొత్తానికైతే ఒక తెలుగు సినిమా ఎల్లలు దాటి ప్రపంచ సినిమాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది అంటే నిజంగా అది మన దర్శకుడు రాజమౌళి యొక్క గొప్పతనం అనే చెప్పాలి.
ఆయన కనక ఇద్దరు స్టార్ హీరోలను తీసుకొని ఇలాంటి ఒక భారీ ప్రయోగం చేయకపోతే ఇలాంటి ఒక గొప్ప సక్సెస్ దక్కేదే కాదు. ఇలాంటి అవార్డులు వచ్చేవే కావు. తెలుగు సినిమా స్థాయి అనేది అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపును సాధించుకునేదే కాదు.
Also Read : ఎన్టీఆర్ వల్లే #RRR లోని ఆ పాట సెన్సేషన్ అయ్యిందంటూ జపాన్ లో రాజమౌళి ప్రశంసలు!
Happy Birthday #NTR – #RamCharan @tarak9999 #RRRinLondon #ManOfMassesNTR pic.twitter.com/U4yCA7NCKR
— AndhraNTRFC (@AndhraNTRFC) May 11, 2025