Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగింది. మొదటి నుంచి ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక పుష్ప సినిమాకి ఆ టైటిల్ ని ఎలా పెట్టాడు అనే విషయ మీద ప్రతి ఒక్కరిలో ఒక డౌట్ అయితే కలుగుతుంది. ఇక రీసెంట్ గా ఆయన ఈ సినిమా టైటిల్ ని ఎలా పెట్టాడు అనే దానికి క్లారిటీ అయితే ఇచ్చాడు. సుకుమార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతన్ని అందరూ తమిళనాడుకు చెందిన వ్యక్తి అని అనుకునే వారట.
Also Read : 2 నిమిషాల్లో హౌస్ ఫుల్..రీ రిలీజ్ లో ‘ఆర్య 2’ సెన్సేషనల్ రికార్డు!
ఎందుకంటే సుకుమార్ అనే పేరు తెలుగులో పెద్దగా ఎవరు పెట్టుకోరు. తమిళియన్స్ అయితే ఈ పేరుని ఎక్కువగా వాడుతూ ఉంటారనే ఉద్దేశ్యంతో చాలామంది అతనితో తమిళ్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసేవారట. కానీ సుకుమార్ మాత్రం తను తెలుగు వాడినని చెబుతూ తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడేవాడు.
ఇక రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ సైతం సుకుమార్ తో తమిళంలో మాట్లాడి నువ్వు తమిళ్ వాడివి కాదా అంటూ అడగడంతో ఆయనకు చాలా వరకు ఆశ్చర్యం కలిగిందట. మొత్తానికైతే సుకుమార్ తెలుగు రాష్ట్రానికి చెందిన వాడే అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక పుష్ప సినిమాకి ఆ టైటిల్ని పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మొదట ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారట.
ఆ సమయంలోనే ఆయన కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు ను కలిసినప్పుడు అందులో ఒక వ్యక్తి పేరు ‘పుష్పరాజ్’ అని ఉండటం సుకుమార్ గమనించారట. అందరూ అతన్ని పుష్ప అని పిలుస్తూ ఉండడాన్ని అబ్జర్వ్ చేసిన ఆయన ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టినట్లుగా తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
Also Read : నెపోటిజం కారణంగా బాలీవుడ్ లో శ్రీలీలకు అవమానం..క్రేజీ మూవీ నుండి అవుట్!