Electric Vehicles : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి..కానీ ఇంకా చాలా మంది వాటి ధర ఎక్కువగా ఉందని వాటిని కొనేందుకు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక పెద్ద ప్రకటన చేశారు. దేశంలో ప్రస్తుతం ఒక పెద్ద పని జరుగుతోందని.. అది పూర్తయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పెట్రోల్-డీజిల్ వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమని, దానిని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం చాలా అవసరమని చెప్పారు.
Also Read : తిరిగినన్ని రోజులు తిరగండి నచ్చకపోతే ఇచ్చేయండి..లూనా మైండ్ బ్లోయింగ్ ఆఫర్
నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల ధరలో బ్యాటరీదే ప్రధాన వ్యయమని అన్నారు. దేశంలో ‘లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గగానే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడతాయని’ ఆయన చెప్పారు. 2030 నాటికి భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్-1 స్థానంలో ఉంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో లిథియం అయాన్ బ్యాటరీల ధరలు వేగంగా తగ్గుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం వాటి ధర కిలోవాట్‌కు 100 డాలర్లకు చేరుకుందని, కొన్ని సంవత్సరాల క్రితం ఇది కిలోవాట్‌కు 150 డాలర్లుగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇది మరింత తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చౌకగా లభిస్తాయని ఆయన అన్నారు.
భారతదేశంలో కొత్త బ్యాటరీ టెక్నాలజీ పై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. లిథియం అయాన్‌కు బదులుగా జింక్-అయాన్, సోడియం-అయాన్ , అల్యూమినియం-అయాన్ వంటి బ్యాటరీ టెక్నాలజీ పై పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీల ధరలు 2025 నాటికి కిలోవాట్‌కు 113 డాలర్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. జింక్-అయాన్ బ్యాటరీలు లిథియం అయాన్‌కు సురక్షితమైన, స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతున్నాయి. సోడియం-అయాన్ బ్యాటరీలు కూడా లిథియం-అయాన్ బ్యాటరీలకు తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయంగా పరిశోధనలో ఉన్నాయి. అల్యూమినియం-అయాన్ బ్యాటరీలు సైద్ధాంతికంగా అధిక శక్తి సాంద్రత, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, వాటి కమర్షియల్ గా వినియోగించేందుకు మరింత పరిశోధనలు అవసరం అన్నారు.
కాలుష్యం భారతదేశానికి అతిపెద్ద సమస్య అని నితిన్ గడ్కరీ అన్నారు. రవాణా రంగం దీనికి ప్రధాన కారణాలలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. బ్యాటరీతో పనిచేసే వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం భారతదేశం ప్రతి సంవత్సరం పెట్రోలియం దిగుమతులపై 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈవీలకు మారడం వల్ల ఈ డబ్బు ఆదా అవుతుంది. ఇది దేశ ప్రగతికి చాలా ముఖ్యమైనది అని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : త్వరలో మార్కెట్లో మారుతి ఈ విటారా.. హ్యుందాయ్ క్రెటా షెడ్డుకెళ్లాల్సిందేనా ?